ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ మేకపాటి శాంతి కుమారి శనివారం ఆత్మకూరు నియోజకవర్గంలోని మర్రిపాడు, ఏఎస్పేట, సంగం, అనంతసాగరం, ఆత్మకూరు గ్రంథాలయాలను సందర్శించారు. స్థానిక నాయకులతో కలిసి గ్రంథాలయాల నిర్వహణ, పుస్తకాల నిల్వలు, రికార్డులను పరిశీలించారు. పాఠకులకు అందుతున్న సౌకర్యాలపై వివరాలు తెలుసుకుని, విద్యార్థులు ఎక్కువగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మార్గదర్శకత్వంలో గ్రంథాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తామని తెలిపారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సహకారంతో మౌలిక వసతులు మెరుగుపరుస్తామని వెల్లడించారు.

ఆత్మకూరు నియోజకవర్గ గ్రంథాలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి