గంగ నీళ్ల జాతరలో ప్రత్యేక పూజలు
సారంగాపూర్, అక్టోబర్ 18: నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం ఆడెలి గ్రామంలో నిర్వహించిన శ్రీ ఆడెలి మహాపోచమ్మ అమ్మవారి గంగ నీళ్ల జాతరలో మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు.
భక్తిశ్రద్ధలతో నిర్వహించిన జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి.
ఈ కార్యక్రమంలో అల్లోల సురేందర్ రెడ్డి, సత్యనారాయణ, ఆడెలి మాజీ చైర్మన్ ఆయిట చందు, శ్రీనివాస్, గంగారెడ్డి, రమణారెడ్డి. పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.



