Story highlights
- గంగ నీళ్ల జాతరలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంగ్రెస్ నేత సారంగాపూర్: నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం ఆడెలి గ్రామంలో శ్రీ ఆడెలి మహాపోచమ్మ అమ్మవారి గంగ నీళ్ల జాతర సందర్భంగా నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక…
- ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు పొందారు.
- భక్తిశ్రద్ధలతో నిర్వహించిన గంగ నీళ్ల జాతరకు పలువురు భక్తులు హాజరై అమ్మవారికి పూజలు నిర్వహించారు.
గంగ నీళ్ల జాతరలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంగ్రెస్ నేత
సారంగాపూర్: నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం ఆడెలి గ్రామంలో శ్రీ ఆడెలి మహాపోచమ్మ అమ్మవారి గంగ నీళ్ల జాతర సందర్భంగా నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు పొందారు.
భక్తిశ్రద్ధలతో నిర్వహించిన గంగ నీళ్ల జాతరకు పలువురు భక్తులు హాజరై అమ్మవారికి పూజలు నిర్వహించారు. జాతర సందర్భంగా ఆలయ పరిసరాల్లో భక్తుల సందడి నెలకొంది.
ఈ కార్యక్రమంలో నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీంరెడ్డి, నిర్మల్ గండిరామన్న ఆలయ చైర్మన్ కొట్టె శేఖర్, సారంగాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హాది, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.