ఆడపూరు పంచాయతీ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన మినీ గోకులం ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి హాజరై మినీ గోకులం శిలాఫలకాన్ని ఆవిష్కరించి రిబ్బన్ కట్ చేశారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, దిశానిర్దేశంలో, పశుసంవర్ధక–పాడి పరిశ్రమ అభివృద్ధి మరియు మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చంనాయుడు ప్రోత్సాహంతో గ్రామీణాభివృద్ధి, పశుసంరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్న కూటమి ప్రభుత్వ విధానాలకు ఈ మినీ గోకులం ప్రతీకగా నిలిచిందని నేతలు పేర్కొన్నారు.
ఈ మినీ గోకులం ఏర్పాటు మేడా విజయ శేఖర్ రెడ్డి చొరవ, కృషి వల్లే సాధ్యమైందని గ్రామస్తులు తెలిపారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ గ్రామాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఆయన సేవలను కొనియాడారు. ముఖ్యంగా పశుసంపద సంరక్షణ, రైతులకు మేలు చేసే కార్యక్రమాలకు ఇస్తున్న ప్రాధాన్యం అభినందనీయమని అన్నారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రైతులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండూరు దిలీప్‌తో పాటు గ్రామ టిడిపి నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.
మినీ గోకులం ఏర్పాటుతో గ్రామంలోని గోవులకు సురక్షిత ఆశ్రయం లభించడమే కాకుండా, రైతులకు సేంద్రీయ ఎరువులు అందుబాటులోకి వస్తాయని, దీని ద్వారా గ్రామ ఆర్థికాభివృద్ధికి ఊతం లభిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో టంగుటూరు ఎంపీటీసీ భువన బోయిన పెంచలయ్య, కొండూరు దిలీప్ రాజు, కొండూరు వెంకటేష్ రాజు, కొండూరు రమేష్ రాజు, కొండూరు సుదర్శన్ రాజు, కొండూరు రవిచంద్ర రాజు, కొండూరు రాజశేఖర్ రాజు, కొండూరు కార్తీక్ వర్మ, కొండూరు భరత్ రాజు, కొండూరు అచ్యుత్ వర్మ, చుక్క వెంకటేష్, టిడిపి నాయకుడు గుజ్జుల ఈశ్వరయ్య, ఆడపూరు స్కూల్ చైర్మన్ ఇరువురి మురళి, ముస్లిం మైనారిటీ యువ నాయకుడు పఠాన్ మెహర్ ఖాన్, ఎల్లమరాజుపల్లి శ్రీనివాసులు రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


