కార్యక్రమానికి అంతంత మాత్రమే హాజరు…
గండి కొట్టిన ఉచిత బస్సు…
ఫిట్నెస్ ఉండాలన్న ప్రభుత్వ నిబంధనపై అసంతృప్తి…
అమలాపురం, అక్టోబరు 04 (పున్నమి ప్రతినిధి) :
ప్రభుత్వ పథకంలో కూడా రాజకీయాలు తొంగి చూస్తున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే అమలాపురంలో ఆటో వాలాల సంఖ్య వందల్లో ఉన్నాయి. అయితే వారికి ఉద్దేశించిన లబ్ధి కార్యక్రమంలో కుడా వారు దూరంగా ఉండటం పై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. కూటమి నేతలు ఆటోలు ముందు పార్టీ జెండాలు పట్టుకుని నిలబడి ఫోటోలు తీసుకుంటుంటే కుదరదన్న ఆటో నేతల తీరు దేశ నేతల్లో చర్చకు దారి తీసింది. ఇదిలా ఉంటే కొంతమంది ఆటో నేతల్లో అసంతృప్తి కనిపిస్తోంది. ఉచిత బస్సు తమకడుపును కొట్టిందని ఆవేదన వీరిలో స్పష్టంగా కనిపిస్తోంది. ఫిట్నెస్ ఉన్న వాహనాలకే 15 వేల లబ్ది అందించడం పట్ల కూడా వీరిలో ఆగ్రహం కలిగించింది. ఏమయినప్పటికి ప్రభుత్వం అందించిన ఈ కార్యక్రమం లో రాజకీయ నీడలు కనిపించడం 100 లోపు ఆటోలు ఈ కార్యక్రమం లో పాల్గొనడం ఆటో వాలా ల ఉద్దేశ్యాన్ని తెలియచేస్తున్నాయి.

ఆటో వాలాల్లో పార్టీ రాజకీయం..
కార్యక్రమానికి అంతంత మాత్రమే హాజరు… గండి కొట్టిన ఉచిత బస్సు… ఫిట్నెస్ ఉండాలన్న ప్రభుత్వ నిబంధనపై అసంతృప్తి… అమలాపురం, అక్టోబరు 04 (పున్నమి ప్రతినిధి) : ప్రభుత్వ పథకంలో కూడా రాజకీయాలు తొంగి చూస్తున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే అమలాపురంలో ఆటో వాలాల సంఖ్య వందల్లో ఉన్నాయి. అయితే వారికి ఉద్దేశించిన లబ్ధి కార్యక్రమంలో కుడా వారు దూరంగా ఉండటం పై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. కూటమి నేతలు ఆటోలు ముందు పార్టీ జెండాలు పట్టుకుని నిలబడి ఫోటోలు తీసుకుంటుంటే కుదరదన్న ఆటో నేతల తీరు దేశ నేతల్లో చర్చకు దారి తీసింది. ఇదిలా ఉంటే కొంతమంది ఆటో నేతల్లో అసంతృప్తి కనిపిస్తోంది. ఉచిత బస్సు తమకడుపును కొట్టిందని ఆవేదన వీరిలో స్పష్టంగా కనిపిస్తోంది. ఫిట్నెస్ ఉన్న వాహనాలకే 15 వేల లబ్ది అందించడం పట్ల కూడా వీరిలో ఆగ్రహం కలిగించింది. ఏమయినప్పటికి ప్రభుత్వం అందించిన ఈ కార్యక్రమం లో రాజకీయ నీడలు కనిపించడం 100 లోపు ఆటోలు ఈ కార్యక్రమం లో పాల్గొనడం ఆటో వాలా ల ఉద్దేశ్యాన్ని తెలియచేస్తున్నాయి.

