పున్నమి తెలుగు దినపత్రిక ✍️
ఏపీలో ఆటో,మ్యాక్సీ క్యాబ్,టాక్సీ డ్రైవర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వాహన మిత్ర పథకం కింద డ్రైవర్లకు రెండో విడత ఆర్ధిక సాయం అందజేయనుంది. జూన్ 4న ఈ కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నారు. ఓనర్ కమ్ ఆటో, మ్యాక్సీ క్యాబ్,ట్యాక్సీ వాహనాలు సొంతంగా కొనుక్కొని నడుపుకుంటూ,వృత్తిగా జీవిస్తున్నవారికి పథకం వర్తిస్తుంది. దరఖాస్తులకు మే 26 చివరి తేదీ కాగా,ఆన్ లైన్ లోనూ దరఖాస్తులు చేసుకోవచ్చు.