Tuesday, 24 March 2026
  • Home  
  • ఆటో డ్రైవర్లకు అండగా కూటమి ప్రభుత్వం జిల్లా ఇన్చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు.
- తూర్పు గోదావరి

ఆటో డ్రైవర్లకు అండగా కూటమి ప్రభుత్వం జిల్లా ఇన్చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు.

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని తూర్పుగోదావరి జిల్లా ఇన్చార్జ్ మంత్రి, జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శనివారం ఉదయం అట్టహానంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. ఆ దిశగా వేలాదిమంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్న ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం మేనిఫెస్టోలో లేనప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గొప్ప ఆలోచనతో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం ద్వారా ఆటో రిక్షా మ్యాక్సీ క్యాబ్ మోటార్ క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి 15వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,90,669 మంది ఆటో డ్రైవర్లకు రూ. 436 కోట్లు వారి బ్యాంకు ఖాతాలలో జమ చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో అనేక ఆంక్షలు పెట్టి 2,61,000 మంది ఆటో డ్రైవర్లకి 10 వేలు చొప్పున సంవత్సరానికి రూ.260 కోట్లు ఖర్చు చేస్తే ఈనాడు 2,90,669 మంది ఆటో, క్యాబ్ డ్రైవర్లకు 15 వేల రూపాయల చొప్పున రూ.436 కోట్లను ఖర్చు చేస్తున్నామని మంత్రి నిమ్మల తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా సుమారు 12000 మందికి సంవత్సరానికి రూ.15వేల చొప్పున రూ.18 కోట్లను వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నామని తెలిపిన మంత్రి నిమ్మల ఒకపక్క సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృద్ధిని కూడా పరుగులు పెట్టిస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా ఒక్కొక్కరికి రూ.15 వేలు అందించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారుకు సహాయం అందిస్తామన్నారు. అర్హత ఉండి ఎవరికైనా లబ్ధి చేకూరకపోతే అధికారుల దృష్టికి తీసుకొస్తే సమస్య పరిష్కరించి లబ్ధి చేకూరేలా చర్యలు చేపడుతామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా సహాయమందిస్తుందన్నారు. రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది. రాష్ట్ర ప్రజలు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని అంటున్నారు. గతంలో ఆటో కార్మికులకు ఆటో ఒక్కొక్కరికి పదివేల రూపాయలు ఇస్తే ఇప్పుడు రూ. 15 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. గతంలో సంవత్సరానికి కార్మికుల మీద 260 కోట్ల రూపాయల ఖర్చు చేస్తే ఇప్పుడు 436 కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నాం. దీన్నిబట్టి కూటమి ప్రభుత్వం ఆటో కార్మికులపై ఉంచిన నిబద్ధతను అర్ధం చేసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం పన్నులు పెంచకుండా ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తుంది. రోడ్లు మరమ్మత్తులు చేస్తున్నాం, పెట్రోల్ డీజిల్ ధరలు పెరగకుండా చూస్తున్నాం. ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తా ఉన్నాం. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి, దీపం, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. మెగా డీఎస్సీను నిర్వహించాం. సంపద సృష్టించి ప్రజలందరికీ షరతులు లేని సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం అందిస్తోంది.” అని ఆదిరెడ్డి వాసు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, జనసేన సిటీ ఇన్చార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, కూటమి నాయకులు వర్రే శ్రీనివాస్, మజ్జి రాంబాబు, జాయింట్ కలెక్టర్ మేఘాస్వరూప్ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని తూర్పుగోదావరి జిల్లా ఇన్చార్జ్ మంత్రి, జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శనివారం ఉదయం అట్టహానంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. ఆ దిశగా వేలాదిమంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్న ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం మేనిఫెస్టోలో లేనప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గొప్ప ఆలోచనతో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం ద్వారా ఆటో రిక్షా మ్యాక్సీ క్యాబ్ మోటార్ క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి 15వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,90,669 మంది ఆటో డ్రైవర్లకు రూ. 436 కోట్లు వారి బ్యాంకు ఖాతాలలో జమ చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో అనేక ఆంక్షలు పెట్టి 2,61,000 మంది ఆటో డ్రైవర్లకి 10 వేలు చొప్పున సంవత్సరానికి రూ.260 కోట్లు ఖర్చు చేస్తే ఈనాడు 2,90,669 మంది ఆటో, క్యాబ్ డ్రైవర్లకు 15 వేల రూపాయల చొప్పున రూ.436 కోట్లను ఖర్చు చేస్తున్నామని మంత్రి నిమ్మల తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా సుమారు 12000 మందికి సంవత్సరానికి రూ.15వేల చొప్పున రూ.18 కోట్లను వారి
బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నామని తెలిపిన మంత్రి నిమ్మల ఒకపక్క సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృద్ధిని కూడా పరుగులు పెట్టిస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా ఒక్కొక్కరికి రూ.15 వేలు అందించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారుకు సహాయం అందిస్తామన్నారు. అర్హత ఉండి ఎవరికైనా లబ్ధి చేకూరకపోతే అధికారుల దృష్టికి తీసుకొస్తే సమస్య పరిష్కరించి లబ్ధి చేకూరేలా చర్యలు చేపడుతామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా సహాయమందిస్తుందన్నారు. రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది. రాష్ట్ర ప్రజలు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని అంటున్నారు. గతంలో ఆటో కార్మికులకు ఆటో ఒక్కొక్కరికి పదివేల రూపాయలు ఇస్తే ఇప్పుడు రూ. 15 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. గతంలో సంవత్సరానికి కార్మికుల మీద 260 కోట్ల రూపాయల ఖర్చు చేస్తే ఇప్పుడు 436 కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నాం. దీన్నిబట్టి కూటమి ప్రభుత్వం ఆటో కార్మికులపై ఉంచిన నిబద్ధతను అర్ధం చేసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం పన్నులు పెంచకుండా ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తుంది. రోడ్లు మరమ్మత్తులు చేస్తున్నాం, పెట్రోల్ డీజిల్ ధరలు పెరగకుండా చూస్తున్నాం. ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తా ఉన్నాం. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి, దీపం, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. మెగా డీఎస్సీను నిర్వహించాం. సంపద సృష్టించి ప్రజలందరికీ షరతులు లేని సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం అందిస్తోంది.” అని ఆదిరెడ్డి వాసు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, జనసేన సిటీ ఇన్చార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, కూటమి నాయకులు వర్రే శ్రీనివాస్, మజ్జి రాంబాబు, జాయింట్ కలెక్టర్ మేఘాస్వరూప్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.