చిట్వేలి, సెప్టెంబర్ 29 (పున్నమి ప్రతినిధి)
చిట్వేలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల బోధకుడిగా, ఎన్సీసీ అధికారిగా తన సేవలను అందిస్తున్న పసుపుల రాజశేఖర్ గారు, విద్యా రంగం మరియు సామాజిక సేవలో చేసిన విశిష్ట కృషికి గాను ఆచార్యదేవోభవ జాతీయ పురస్కారం–2025 అందుకున్నారు.ఈ అవార్డును ఆదివారం బాపట్ల జిల్లా వేటపాలెంలో యువతేజం ట్రస్ట్ – కలాం విజన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో, తెలంగాణ హైకోర్టు చీఫ్ సూపరింటెండెంట్ పీవీపీ అంజలి కుమారి, సంస్థ చైర్మన్ ఎస్. కరీముల్లా, డాక్టర్ నారాయణస్వామి చేతుల మీదుగా ఆయనకు అందజేశారు.ఈ సందర్భంగా రాజశేఖర్ గారు మాట్లాడుతూ –“ఉపాధ్యాయ వృత్తిలో ఉత్తమ బోధనతో పాటు, సమాజ సేవలో చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం రావడం ఆనందంగా ఉంది. ఇది భవిష్యత్‌లో మరింత బాధ్యతతో సేవ చేయడానికి నన్ను ప్రేరేపిస్తుంది” అని తెలిపారు.ఈ విజయానికి సహచర ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానికులు ఆయనను హృదయపూర్వకంగా అభినందించారు.


