-చిట్వేల్ తహసిల్దార్‌ను కలిసి ఆదేశాలిచ్చిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కస్తూరి విశ్వనాథ నాయుడు
-అర్హులను గుర్తించి ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తామని తహసిల్దార్ హామీ
చిట్వేలి, అక్టోబర్ 23(పున్నమి ప్రతినిధి)
అన్నమయ్య జిల్లా, రైల్వేకోడూరు నియోజకవర్గం, చిట్వేలి మండలంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను అర్హులైన నిరుపేదలకు ఇళ్ల పట్టాలుగా మంజూరు చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కస్తూరి విశ్వనాథ నాయుడు గురువారం తహసిల్దార్‌ను కలిసి ఆదేశాలు ఇచ్చారు.కస్తూరి విశ్వనాథ నాయుడు చిట్వేలి మండలంలోని మాలెమాపురం గ్రామపంచాయతీ ఈడిగపల్లి గ్రామస్థులతో కలిసి స్థానిక తహసిల్దార్ గారిని కలిసి ఈ సమస్యను ప్రస్తావించారు. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని నిరుపేదలైన బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని ఆయన కోరారు.
-తహసిల్దార్ సానుకూల స్పందన
దీనిపై తహసిల్దార్ సానుకూలంగా స్పందించారు. “రేపే నేను ఆ గ్రామాన్ని సందర్శిస్తాను. ఎక్కడైతే ఆక్రమణకు గురైందో ఆ ప్రదేశానికి వెళ్లి వెంటనే గుర్తిస్తాను. మీరు చెప్పినట్లుగా ఎవరైతే అర్హులు ఉంటారో వారిని గుర్తించి తప్పకుండా ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తాము,” అని తహసిల్దార్ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో శ్రీ కస్తూరి విశ్వనాథ నాయుడు పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త మాచినేని విశ్వేశ్వర నాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సాంస్కృతిక విభాగ అధ్యక్షులు పంతగాని నరసింహ ప్రసాద్ మరియు మండలంలోని ముఖ్య నాయకులు, ఈడిగపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు.


