మనుబోలు (పున్నమి విలేఖరి )13,ఏప్రిల్ :
తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మనుబోలు లో నిర్వహించిన బహిరంగ సభకు పలువురు వైకాపా అగ్రనాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ రాబోయే ఉప ఎన్నిక ఏకపక్ష మే అన్నారు టిడిపి అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతిక్షణం అడ్డు పడుతోందని విమర్శించారు. రాష్ట్రంలో శాస్వత ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ఉండి పోతారని జోస్యం చెప్పారు. అదేవిధంగా టిడిపి రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోతుందని తెలిపారు .ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన రెడ్డి నాయకత్వంలో లో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం పరుగులు తీస్తోంది అన్నారు 29 కోట్లతో బండేపల్లి కాలువ పనులను ప్రారంభించామన్నారు మండల కేంద్రమైన మనుబోలు లో ఈ 20 నెలల కాలంలో 50 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. చంద్రబాబు నాయుడు పొదలకూరు లో ఊరేగి నన్ను జగన్మోహన్ రెడ్డిని తిట్టి వెళ్లిపోయారని అభివృద్ధి సంక్షేమం ఏమి చేశారో చెప్పలేదు అని విమర్శించారు. శ్రీశైలం ఎమ్మెల్యే చక్రపాణి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే వృధాయే అన్నారు. దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి గా జగన్ మోహన్ రెడ్డి నిలిచిపోతారు అన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా వైకాపా గెలుపొందుతుందన్నారు. ఉప ఎన్నికల్లో చంద్రబాబుకు 20 శాతం ఓట్లు రానున్నాయని జోస్యం చెప్పారు గురుమూర్తి నీ అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు్ పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ గురుమూర్తి గెలుపుకు గ్రామ గ్రామాల నాయకులు కృషి చేయాలన్నారు 2019 నుండి చంద్రబాబుకు మతిభ్రమించింది అని విమర్శించారు రాబోయే ఉప ఎన్నికల్లో 90 శాతం పోలింగ్ అయ్యేందుకు నాయకులు కృషి చేయాలన్నారు అధికారం చేపట్టిన 20 నెలల కాలంలో 95శాతం హామీలను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ సర్వేపల్లి లో దశాబ్దాల కాలంగా తమకు సంబంధం ఉందని రైతుల సంక్షేమం కోసం పాటు పడుతున్నారని తెలిపారు గత రెండు సంవత్సరాలుగా సంక్రాంతి వైభవంగా జరుగుతుందంటే జగన్మోహన రెడ్డి పుణ్యమే అని అన్నారు వైకాపా ప్రభుత్వాన్ని గత ఎన్నికల్లో ఆదరించినట్లు తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా గురుమూర్తి కి అత్యధిక మెజార్టీ వచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఎమ్మెల్సీ గంగులు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అతి సామాన్యుడు కు ఎంపీ టికెట్ ను ప్రసాదించాలని ప్రతి ఒక్కరూ సామాన్యుడైన గురుమూర్తి గెలిపించాలని వేడుకొన్నారు టిడిపి ప్రభుత్వంలో ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పాలని చంద్రబాబును ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో కర్నూల్ మేయర్ రామయ్య భారీగా మనుబోలు మండల వ్యాప్తంగా వైసిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.