సెప్టెంబర్ 25న పవన్ కళ్యాణ్ ఓజి చిత్రం విడుదల
ఈ నేపథ్యంలో సామాజిక సేవ కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రం ఓజి సెప్టెంబర్ 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏయూ యూత్ వింగ్ అసోసియేషన్ సభ్యులు రక్తదానం చేశారు. మహారాణిపేట లోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకులో ఆదివారం ఈ రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి పిలుపుతో అనేక మంది రక్తదానం చేసి ఎన్నో ప్రాణాలను కాపాడుతున్నారన్నారు. ఇదే క్రమంలో తాము కూడా రక్తదానం చేశామని తెలిపారు. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రక్తదానం చేసి మరొకరి ప్రాణాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. ఇదే క్రమంలో ఓజి చిత్రం ఘనవిజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏయూ జనసేన యూత్ వింగ్ సభ్యులు పైడికొండ సునీల్ నాయుడు, సేనాపతి వెంకటేశ్వరరావు, గురు స్వామి, ప్రదీప్, జస్వంత్, శ్రవణ్ కుమార్, దీపక్ తదితరులు పాల్గొన్నారు. రక్తదానం చేసిన ఏయు జనసేన యూత్ వింగ్ సభ్యులను
రెడ్ క్రాస్ చైర్మన్ బాల సతీష్, రావు, కొయిలాడ శ్రీనివాసరావు అభినందించారు.

