*విశాఖపట్నంనవంబర్ పున్నమి ప్రతినిధి *
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారి ఆదేశాల ప్రకారం కింగ్ జార్జ్ ఆసుపత్రి లో 76వ రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు . సూపరింటెండెంట్ డాక్టర్ డా.ఐ. వాణి భారత దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్ర పటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాజ్యాంగం వలన మనకు న్యాయము స్వచ్ఛ హక్కు సామాజిక ఆర్ధిక రాజకీయ న్యాయము జరుగుతుంది అని ఆ హక్కులను కాపాడవలసిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. మన రాజ్యాంగం అమలు అయి నేటికి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈ సంవత్సరం మొత్తం కూడా “హమారా సంవిధాన్ హమారా స్వాభిమాన్”.
“మన రాజ్యాంగం – మన గౌరవం” కార్యక్రమాన్ని దేశం మొత్తం అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు.
ఈ యొక్క కార్యక్రమంలో కె.జి. హెచ్. సూపరింటెండెంట్ డా.ఐ.వాణి తో పాటు అడ్మినిస్ట్రేటర్ బి.వి.రమణ, సి.యస్.ఆర్.ఎమ్.ఓ. డా.యు. శ్రీహరి, డిప్యూటి సూపరింటెండెంట్ డా.జి.వాసవిలత, ఆర్.ఎమ్.ఓ. లు డా.ఏ. రాజేష్, డా.బి. బంగారయ్య, యస్. చంద్రబాబు నాయుడు, నర్సింగ్ సూపరింటెండెంట్ సి. హెచ్. పద్మావతి, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ డా.బి. కిరణ్ కుమార్, అసిస్టెంట్ డైరక్టర్ బి.యస్.సుమతి, మేనేజర్ ఐ.వి. శ్రీనివాసాచారి, ఆఫీస్ సూపరింటెండెంట్ ప్రభాకర్, ఇతర మినిస్టీరియల్ సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది. నర్సింగ్ విధ్యార్థులు మరియు ఇతర కె.జి.హెచ్. సిబ్బంది పాల్గొన్నారు.


