*గాజువాక అక్టోబర్ (పున్నమి ప్రతినిధి)*
విశాఖపట్నంలో రేషన్ డిపోలు అంగన్వాడీ మధ్యాహ్న భోజన పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు బి కాంతారావు తనిఖీ చేసారు. ముందుగా ఉన్నటువంటి రేషన్ డిపో 0388294 పరిశీలించి సరైన స్టాక్ బోర్డు వివరాలు లేని కారణంగా వారికి మెమో ఇవ్వాలని అధికారులను ఆదేశించారు . అనంతరం 0388303 పరిశీలించి డిపో పరిశుభ్రత పాటించాలని హెచ్చరించారు.. 0388606, 0388604 లో లబ్ధిదారులకి సరైన సమయానికి సరఫరా అయ్యేలా చూడాలి అని హెచ్చరించారు. కుంచుమాంబ కాలనీ అంగన్వాడీ కేంద్రం, జడ్పీ హైస్కూల్ అగనంపూడి సందర్శించారు. స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు జరుగుతున్న తీరును పరిశీలించారు. గుడ్లు బరువు విషయంలో లీగల్ మెట్రోలజీ డిపార్ట్మెంట్ పరిశీలించి తక్కువ బరువు ఉండటంతో హెచ్ఎంకి హెచ్చరించారు.. అదేవిధంగా గుడ్లు కాంట్రాక్టర్ తో మాట్లాడి తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా తెలియజేసారు.. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అధికారులు గాజువాక ఏఎస్ఓ కృష్ణ, ఆర్ ఐ బంగార్రాజు, ఆర్ఐ పల్లా మహేష్, అధికారులు, ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్ అధికారులు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులు ఫుడ్ సేఫ్టీ అప్పారావు, లీగల్ మెట్రోలాజి ఉదయ్ కుమార్ తదితరులు పాల్గున్నారు…


