ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో “సొసైటీ ఫర్ వైబ్రేంట్ విజయవాడ” సారధ్యంలో “విజయవాడ ఉత్సవ్” వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫెస్టీవ్ కార్నివల్ వాక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్ లతో కలిసి స్వాగతం పలకడం జరిగింది… అనంతరం విజయవాడ ఉత్సవ్ కార్నివాల్ వాక్ వేడుకలను జెండా ఊపి ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు…
విజయవాడ ఉత్సవ్ కార్నివాల్ వాక్ వేడుకలలో లార్జెస్ట్ డప్పు ఆర్టిస్ట్ ర్యాలీగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించడం విజయవాడ నగరానికే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతగానో గర్వకారణం… అడ్జుడికేటర్ ఫర్ ది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ స్వపిణి దంగిరికర్ గారు అందజేసిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ ను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, సొసైటీ ఫర్ వైబ్రేంట్ విజయవాడ సభ్యులతో కలిసి అందుకోవడం జరిగింది…
40 కి కళాబృందాలు, మూడు వేలకు పైగా కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలతో బందర్ రోడ్డు అంతా ఉత్సవ వాతావరణం నెలకొంది… విజయవాడ ఉత్సవ్ కి కర్త, కర్మ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ నారా చంద్రబాబునాయుడు గారు ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఎన్నో ఫెస్టివల్స్ నిర్వహించారు… ఆ ఫెస్టివల్స్ తో హైదరాబాద్ ను వైబ్రేంట్ చేశారు… భవిష్యత్తులో అమరావతికి మణిహారంగా విజయవాడ ఉత్సవం ఉండబోతుంది… ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు మరియు అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఏడాది విజయవాడ వచ్చావు నిర్వహిస్తాము… గత 11 రోజులుగా 4 వేదికల్లో కళాకారులను ప్రోత్సహించటమే కాకుండా సత్కరించాము.. కళాకారుల ప్రతిభను నగరవాసులు ఎంతగానో ఆదరించారు…
విద్య, ఐటీ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ గారి చేతుల మీదుగా ఈ విజయవాడ ఉత్సవ్ ప్రారంభం కావడం, ముగింపు వేడుకలకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి హాజరవ్వడం ఎంతగానో ఆనందంగా ఉంది… ఏపీ టూరిజం, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో 11 రోజులుగా విజయవాడ ఉత్సవ్ విజయవంతంగా సాగింది… మైసూర్, కలకత్తా ఉత్సవాలను తలపించే విధంగా విజయవాడ ఉత్సవ్ ను కూటమి పార్టీ నాయకులు, అధికారులు మరియు నగర ప్రజల భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించుకున్నాము … ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు సంప్రదాయం – ఆధునికత కలబోసిన ప్రత్యేక వేషధారణ ప్రదర్శనలు ప్రజలను పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి..
విజయవాడ ఉత్సవ్ కి సహకరించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి, ఉపముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను… వచ్చే ఏడాది విజయవాడ ఉత్సవ్ మరింత భారీ స్థాయిలో నిర్వహిస్తాము….
ఈ విజయవాడ ఉత్సవ్ కార్యక్రమాన్ని ఇంతగా విజయవంతం చేసిన విజయవాడ నగర వాసులకు, పర్యాటకులకు, భక్తులకు, నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు….


