✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
తూర్పుగోదావరి
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.
ప్రెస్ మీట్ , రాజమండ్రి..
తేది : 4-3-2026
ఆంధ్రప్రదేశ్ పేరు మార్పు పై గరికపాటి నరసింహారావు మాటలు అర్ధరహితం ..
ఆంధ్రప్రదేశ్ పేరులో ప్రదేశ్ ను తొలగించి ఆంధ్ర రాష్ట్రం గా మార్చాల్సిందే .
తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ హిందీ పదంతొ ఆంధ్రులను అవమానించటం తగదు .
ఎంటీఆర్ తెలుగునాడు గా ప్రకటించాలనుకున్న పేరు ను ఎంటీఆరే ఉపసంహారించుకున్నారు .
పండిత పర్వం ఖ్యాతిని పెంచేలా ఉండాలి . దిగజార్చుకునేలా ఉండరాదని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ సూచించారు ..
గరికపాటి నరసింహారావు వారికి వేదం పైన , రామాయణ , హితిహశాల పట్ల ఎంతో పట్టు గల పండితులుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు . ఈ మధ్య కాలంలో గరికపాటి వారికి అస్సులు సంబంధం లేని వాటిపై కొన్ని వ్యాఖ్యానాలు చేస్తు ఆపకీర్తికి గురవుతున్నారు . హిందూ ధర్మం పవిత్రత కోసం , ఆ ధర్మం యొక్క శక్తి సామర్థ్యల కోసం ఎంతగానో జ్ఞానోదయం గల గరికిపాటి గారు ఈ మధ్య పురాణ పురుషులును , దేవ దేవతలను ఏకవచనంతొ శంభోదిస్తు తన ఆహాన్ని , తన అహకార ఉపన్యాసాలను బోదిస్తున్నారు . గరికపాటి ప్రసంగాలు హిందూ మనోభావాలను గాయ పరుస్తున్నట్టుగా వుంటున్నాయి . అప్పుడప్పుడు ఒక రాజకీయ పార్టి ఆధ్యాత్మక విభాగం ప్రతినిధిగా ఉపన్యాసాలు గుప్పిస్తు ఆ ముసుగులో రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారు . పీఠధిపతులు, మత ఉద్బోదకులు సామజిక చైతన్యాన్ని , హిందూ ధర్మం గొప్పతనాన్ని చాటి చెప్పేవిగా ఉండాలి . ఉన్మాదాన్ని ప్రేరేపించే విధంగా ఉండకూడదని ఆయన హితవు పలికారు .
పండిత బిరుదాన్కితులైన గరికపాటి వారికి ఆంధ్ర ప్రాశిసత్యం కోసం , చరిత్ర మూలాలు కోసం , పౌరాణిక పవిత్రత , పోరాటాల కోసం తెలియ వంటారా ! తెలిసే ఆంధ్రప్రదేశ్ పేరును తెలుగునాడుగా ప్రకటించమని గరికపాటి దుందుడుకు ప్రకటన చేస్తున్నారా ! తమిళనాడు రాష్ట్ర పేరును , ఈ మధ్య కేరళం పేరును మార్చుకున్నారు . అందుకని కొంతమంది మేధావులుగా పేర్కొంటున్న వారు ఆంధ్రప్రదేశ్ పేరును కూడా తెలుగునాడుగా మార్చుకోవాలని గరికపాటి తదితర మేధావులు ఎక్కువగా అనవసరమైన వ్యాఖ్యానాలు చేస్తున్నారు . ఆంధ్ర రాష్ట్ర చరిత్ర , గొప్పతనం , ఆ పేరులో గల శక్తి తెలియక అసందర్బ మాటలుతో గరికపాటి వంటి మేధావులు , వారి అనుంగ సేనలుతొ ఆంధ్రరాష్ట్ర ప్రతిష్ట దిగజారే ప్రమాదం వుందని ఆయన ఆవేదన చెందారు .
ఆంధ్ర అనే నామం రామాయణ , మహాభారత కాలానికి ముందునుండి ఆచరణలో వుందని గరికపాటి వారు గ్రహించాలి . ఆదికవి నన్నయ్య ఆంధ్ర మహాభారతం గాను , ఆధునిక కవిత్వాన్ని అచ్చు వేయించిన బమ్మెర పోతన వంటి మహనీయులు ఆంధ్ర మహాభారతం , శ్రీ మద్ ఆంధ్ర భాగవతం గానే పురాణ కాల నిజాలను వ్రాసారు అని గరికపాటి వారు గుర్తించాలి . 12 వ శతబ్దనికి ముందు తెలుగు అనే పద ఉచ్చారణ లేదు . పురాతన గ్రంధాల్లో సైతం ఆంధ్ర పద ఉచ్చారణ వుందని తెలుసుకోవాలి . బాష (తెలుగు), జాతి , ప్రదేశం , సంస్కృతి కలిసిన సమైక్యతకు వారధిగా ఆంధ్ర పద ఉచ్చారణ దైవ సంకల్పంతొ ఆవిర్బవించిన పదమే ఆంధ్ర అని గరికపాటి వంటి మేధావులు ఆలోచింప చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టకు వెన్నుదన్నుగా నిలవాలని ఆయన హితబోధ చేసారు .
ఆంధ్ర పద ఉచ్చారణకు పురాణకాల చరిత్రతొ పాటుగా ఉద్యమ చరిత్ర కూడా వుంది . నిజాం కాలంలో జరిగిన అనేక పోరాట పోరు బాటల్లో ఆంధ్ర అనే పదం లేకుండా ఉద్యమాలే లేవు . ఆ కోణం లోనే ఆనాడు
” ఆంధ్ర మహాసభ ” ఆవిర్బవించిందన్నారు . ఆంధ్ర పదంను తొలగించమని నిజాం పాలనలో ఎన్ని ఒత్తిడిలు , వేధింపులు వచ్చినా ఆంధ్ర పదంను తొలగించలేదనేది జగమెరిగిన నిజం . తొలి రాష్ట్ర విభజన సమయంలో మద్రాస్ రాష్ట్రం నుండి ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కావాలని కర్నూల్ రాజధాని గా విడిపోయింది ఆంధ్ర రాష్ట్రం గానేనని గరికపాటి వారు మరువరాదు . పొట్టి శ్రీరాములు, టంగుటూరు ప్రకాశం పంతులు త్యాగాలతో ఏర్పడిన విభజన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం గానే విడిపోయిందని మేధావులు , పండితులు గమనించాలి . ఆంధ్రుకరించారు అనే ఉచ్చారణ నుండి పురుడు పోసుకున్న పదమే తెలుగు నామం అన్నారు . నిజాం నిరంకుసత్వం పై జరిపిన పోరుబాటలో కూడా ఆంధ్ర పదం తొలగించటం కుదరదు అని నాటి కమ్యూనిస్ట్ లు సైతం ఆంధ్ర మహాసభ వేదికగ జరిగిన ఉద్యమాల్లో అండగా నిలిచారాని ఆయన గుర్తు చేసారు .
గరికపాటి వారి పండిత నైపుణ్యాన్ని హిందూ ధర్మం కోసం , ఖ్యాతి కోసం మాత్రమే ఉపయోగించగలరని ,
ఈ దేశానికి మోదీ ఒక్కడే ఉత్తముడు, ఆంధ్రప్రదేశ్ పేరు మార్చి తెలుగునాడుగా ప్రకటించండి అంటు మిమ్మల్ని అనుసరిస్తున్న వారికి మీ భోదనగా చెప్పి ఆంధ్ర ప్రతిష్టకు మకిలి పట్టించకండి . భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి కుత్రిమ వ్యాధి ఒక్క ఆంధ్రరాష్ట్రం లోనే కొంతమందిలో వుంది . గరికపాటి వంటి మేధావులు , సినిమా వారు ఏది చెప్పినా వినటమే పనిగా ఆంధ్ర రాష్ట్రంలో మానసిక వైఖల్యం పెరిగిపోయింది . అనుసరించే వారు భక్తి మార్గం గాను, వినోదపు మాయా జాలం లోను ఒక రకమైన మత్తులో ప్రజల సొంత మేధస్సు ను నిర్వీర్యం చేసుకుంటున్నారు . గరికపాటి కొన్ని సందర్భాల్లో పవిత్ర రామాయణ, మహాభారతం కోసం కూడా వ్యంగ్యంగా ఛలోక్తులు చేస్తు భక్తి సూక్తులను ఆశ్యం చేస్తున్నారు . అఖండ భారతదేశం లోనే రామాయణ , మహాభారతాలకు ఒక ప్రాశిసిత్యం వుంది . మితి మీరిన అహంతొ పవిత్ర గ్రందాలను , దైవ యోధులను గౌరవ ఉచ్చారణ లేకుండా మాట్లాడటం గరికపాటి వారికి అలవాటుగా మారింది . దైవ సందేశంలో ఉండాల్సింది ఆశ్యం కాదు ఏకగ్రత ముఖ్యం అని గరికపాటి వంటి అవధానులు వారికి తెలిసి ఈ మధ్యన ఎందుకో వారి ఉపన్యాసాలు దారి తప్పి రాజకీయ భోదనలుగా మారుతున్నాయి . నా హిందూ ధర్మం పవిత్రత కోసం , నా ఆంధ్ర రాష్ట్ర ప్రస్థానం దారి తప్పుతున్న పరిస్థితులకు తీవ్ర ఆవేదనతొ మిమ్ములను ప్రశ్నించాల్సి వస్తుందని, యావత్ భారతదేశం లోనే ఏ రాష్ట్రానికి లేనటువంటి అదృష్టం , ఖ్యాతి ఆంధ్ర రాష్ట్రానికి వుంది . హిందూ ధర్మ ఆవిర్బావానికి ఏ విధంగా లెక్క కట్టలేమో ఆంధ్ర నామానికి కాలమానాన్ని లెక్కించలేరని ఆయన పేర్కొన్నారు ..
మద్రాస్ రాష్ట్రం ను నుండి కర్నూల్ రాజధానిగా విడిపోయిన అనంతరం హైదరాబాద్ లో విలీనం జరిపిన సందర్బంలో ప్రదేశ్ అనే పదాన్ని చేర్చి ఆంధ్రప్రదేశ్ గా నామకరణం చేసారు . తెలుగుదేశం పార్టి ఆవిర్బవించిన సమయంలో కొంతమంది అప్పటి మద్రాస్ రాష్ట్రం వారు తమిళనాడు అని పెట్టుకున్నారు . మనం కూడా తెలుగునాడు అని పెట్టుకుంద్దాం అని చర్చ జరిపిన సందర్బంలో అప్పటి కొంతమంది మేధావులు కలుగచేసుకుని ఆంధ్ర ప్రాశిసత్యం , ఆంధ్ర మూలాలు , ఆ పదం యొక్క శక్తి , గొప్పతనం కోసం వివరించగా ఎంటీఆర్ ఆ ఆలోచనను విరమించుకున్నారనే నిజాన్ని గరికపాటి వారు తెలుసుకోవాలి . మండలి వేంకటేశ్వర రావు , మండలి బుద్ధ ప్రసాద్ సారద్యంలో జరిగిన తొలి ప్రపంచ తెలుగు మహాసభలో కూడా వక్తలు ఆంధ్ర చారిత్రిక మూలాలను కొనియాడారు . ముల్కి రూల్స్ కు వ్యతిరేకంగా పుట్టిన ప్రజా ఉద్యమం కూడా జై ఆంధ్ర నినాదంతోనే సాగిందని , ఆంధ్రప్రదేశ్ పేరును ఆంధ్ర రాష్ట్రంగా పేరు మార్చే దిశగా ప్రభుత్వం పరిశీలన చేయాలని అర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఆంధ్రుల త్యాగాల కోసం , చారిత్రిక మూలాల కోసం ఉద్విగ్నంగా మాట్లాడారు ..
ఈ మీడియా సమావేశంలో అర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ లంక దుర్గా ప్రసాద్ , పెండ్యాల కామరాజు, సిమ్మా దుర్గారావు , దుడ్డే త్రినాద్ , బర్ల ప్రసాద్ , వర్ధనపు శరత్ కుమార్ , గుడ్ల సాయి దుర్గా ప్రసాద్ , కొల్లి సత్యనారాయణ, కాకర ప్రసాద్ , ఎస్ కే దేవి, మేకా అయ్యప్ప , కంతి రమాకాంత్ తదితరులు పాల్గొనియున్నారు ….
END

