అమరావతి, ఆగస్ట్ 25 ( పున్నమి స్టాప్ రిపోర్టర్ యామల రామమూర్తి):
ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజనపై మళ్లీ కసరత్తు మొదలైంది. ఇప్పటికే 26 జిల్లాలు ఉన్న రాష్ట్రంలో ప్రభుత్వం మరో ఆరు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. పరిపాలన సౌలభ్యం, ప్రాంతీయ అభివృద్ధి, జనాభా సాంద్రత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
*మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు ప్రారంభం*
కొత్త జిల్లాల రూపకల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మూడు బృందాలుగా విభజమై జిల్లాల వారీగా పర్యటించి ప్రజాభిప్రాయాలు సేకరించనుంది.
24 ఆగస్ట్ 29 నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మంత్రులు పర్యటనలు చేపట్టనున్నారు.
24 సెప్టెంబర్ 2న అల్లూరి జిల్లాలో కూడా అధ్యయనం కొనసాగనుంది.
*ప్రతిపాదిత కొత్త జిల్లాలు*
-అమరావతి జిల్లా – అమరావతి, పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామ
-పలాస జిల్లా – పలాస, ఇచ్ఛాపురం, టెక్కలి, పాతపట్నం
– మార్కాపురం జిల్లా – మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి
-గూడూరు జిల్లా – గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి, సూళ్లూరుపేట
– మదనపల్లె జిల్లా – మదనపల్లె, పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లి
-ఆదోని జిల్లా – ఆదోని, పత్తికొండ, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం
ఈ మార్పులు జరిగితే రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 26 నుంచి 32కి పెరిగే అవకాశం ఉంది.
*రాజకీయ & పరిపాలనా విశ్లేషణ*
2022లో వైసీపీ ప్రభుత్వం 13 జిల్లాలను 26గా విభజించింది. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం మరో ఆరు జిల్లాలను పెంచాలని ముందడుగు వేసింది. అధికారికంగా ఇది పరిపాలన సౌలభ్యం కోసం అని చెప్పినా, రాజకీయ లెక్కలు కూడా ఈ నిర్ణయానికి కారణమని విశ్లేషకుల అభిప్రాయం.
*అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు ఇంకా పెండింగ్*
2014లో అమలులోకి వచ్చిన రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏపీలో అసెంబ్లీ స్థానాలను 175 నుంచి 225కి పెంచే అవకాశం ఉంది. అయితే, కేంద్ర ప్రభుత్వం తాజాగా 2026 అక్టోబర్ నుంచి జనగణన చేపట్టాలని నిర్ణయించడంతో, ఈ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశముందని భావిస్తున్నారు.
**తుది నిర్ణయం ఎప్పుడు..?*
ప్రస్తుతం మంత్రివర్గ ఉపసంఘం పర్యటనలు, ప్రజాభిప్రాయ సేకరణతో ప్రక్రియ మొదలైంది. ఈ నివేదికల ఆధారంగా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. కొత్త జిల్లాలు ప్రకటించబడితే ఆంధ్రప్రదేశ్ పరిపాలనా వ్యవస్థలో మరోసారి భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి.

*ఆంధ్రప్రదేశ్‌లో మరో ఆరు కొత్త జిల్లాలు* – ఏర్పాటుకు వ్యూహరచన
అమరావతి, ఆగస్ట్ 25 ( పున్నమి స్టాప్ రిపోర్టర్ యామల రామమూర్తి): ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజనపై మళ్లీ కసరత్తు మొదలైంది. ఇప్పటికే 26 జిల్లాలు ఉన్న రాష్ట్రంలో ప్రభుత్వం మరో ఆరు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. పరిపాలన సౌలభ్యం, ప్రాంతీయ అభివృద్ధి, జనాభా సాంద్రత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. *మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు ప్రారంభం* కొత్త జిల్లాల రూపకల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మూడు బృందాలుగా విభజమై జిల్లాల వారీగా పర్యటించి ప్రజాభిప్రాయాలు సేకరించనుంది. 24 ఆగస్ట్ 29 నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మంత్రులు పర్యటనలు చేపట్టనున్నారు. 24 సెప్టెంబర్ 2న అల్లూరి జిల్లాలో కూడా అధ్యయనం కొనసాగనుంది. *ప్రతిపాదిత కొత్త జిల్లాలు* -అమరావతి జిల్లా – అమరావతి, పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామ -పలాస జిల్లా – పలాస, ఇచ్ఛాపురం, టెక్కలి, పాతపట్నం – మార్కాపురం జిల్లా – మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి -గూడూరు జిల్లా – గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి, సూళ్లూరుపేట – మదనపల్లె జిల్లా – మదనపల్లె, పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లి -ఆదోని జిల్లా – ఆదోని, పత్తికొండ, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం ఈ మార్పులు జరిగితే రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 26 నుంచి 32కి పెరిగే అవకాశం ఉంది. *రాజకీయ & పరిపాలనా విశ్లేషణ* 2022లో వైసీపీ ప్రభుత్వం 13 జిల్లాలను 26గా విభజించింది. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం మరో ఆరు జిల్లాలను పెంచాలని ముందడుగు వేసింది. అధికారికంగా ఇది పరిపాలన సౌలభ్యం కోసం అని చెప్పినా, రాజకీయ లెక్కలు కూడా ఈ నిర్ణయానికి కారణమని విశ్లేషకుల అభిప్రాయం. *అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు ఇంకా పెండింగ్* 2014లో అమలులోకి వచ్చిన రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏపీలో అసెంబ్లీ స్థానాలను 175 నుంచి 225కి పెంచే అవకాశం ఉంది. అయితే, కేంద్ర ప్రభుత్వం తాజాగా 2026 అక్టోబర్ నుంచి జనగణన చేపట్టాలని నిర్ణయించడంతో, ఈ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశముందని భావిస్తున్నారు. **తుది నిర్ణయం ఎప్పుడు..?* ప్రస్తుతం మంత్రివర్గ ఉపసంఘం పర్యటనలు, ప్రజాభిప్రాయ సేకరణతో ప్రక్రియ మొదలైంది. ఈ నివేదికల ఆధారంగా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. కొత్త జిల్లాలు ప్రకటించబడితే ఆంధ్రప్రదేశ్ పరిపాలనా వ్యవస్థలో మరోసారి భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి.

