Thursday, 26 March 2026
  • Home  
  • ఆంధ్రప్రదేశ్‌లో చికెన్‌షాపులు, విక్రయాలకు సంబంధించి కీలక నిర్ణయం
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఆంధ్రప్రదేశ్‌లో చికెన్‌షాపులు, విక్రయాలకు సంబంధించి కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో చికెన్‌షాపులు, విక్రయాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. చికెన్ వ్యాపారంలో అక్రమాలను అరికట్టేందుకు కొత్త లైసెన్సింగ్ విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది.l రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ, చికెన్ వ్యాపారంలో పారదర్శకతను పెంచడానికి ఈ లైసెన్సింగ్ విధానాన్ని ప్రవేశపెడుతోంది. దీని ద్వారా ప్రతి చికెన్ దుకాణానికి లైసెన్స్ తప్పనిసరి అవుతుంది. ఈ లైసెన్స్ ద్వారా కోళ్ల సప్లై చైన్‌ను పూర్తిగా పర్యవేక్షించవచ్చు. పౌల్ట్రీ ఫారాల నుంచి కోళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, షాపుల యజమానులు ఎవరికి అమ్ముతున్నారు అనే విషయాలను ట్రాక్ చేసేలా పక్కా వ్యవస్థను ఏర్పాటు చేయాలని రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ బోర్డు తీర్మానించింది. ఈ సమాచారం అంతా నమోదు చేస్తారు. ఈ మేరకు విజయవాడలో పశు సంవర్ధకశాఖ డైరెక్టర్ కార్యాలయంలో సంస్థ ఛైర్మన్ చంద్ర దండు ప్రకాష్‌నాయుడు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. డైరెక్టర్లు ప్రవీణ, అజ్ముద్దీన్, పశు సంవర్ధక శాఖ సంచాలకులు టి.దామోదర్‌నాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు. గతంలో జరిగిన మాంసం మాఫియా అక్రమాలపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించారు.ఈ కొత్త విధానం చికెన్ వ్యాపారంలో అక్రమాలకు అడ్డుకట్ట వేస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా, రాష్ట్ర ప్రభుత్వం మాంసం దుకాణాల క్రమబద్ధీకరణపై దృష్టి సారించింది. మున్సిపాలిటీల్లో మాంసం దుకాణాలపై ఆకస్మిక దాడులు చేసి, అక్రమాలను అరికట్టాలని నిర్ణయించింది. హోటల్స్, రెస్టారంట్ల నిర్వాహకులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన చికెన్ షాపుల నుంచే మాంసం కొనుగోలు చేసేలా ప్రోత్సహించడంతో పాటు, స్టెరాయిడ్లు వాడిన కోళ్ల అమ్మకాలను పూర్తిగా నియంత్రించనుంది. చికెన్ షాపుల్లో వ్యర్థాలను చేపలకు ఆహారంగా వాడుతున్న మాఫియాను అరికట్టి, ప్రజారోగ్యానికి ఇబ్బంది కలగకుండా వ్యర్థాలను సేకరించి, సురక్షితంగా పారవేయాలని ఆదేశించింది. అక్రమ కబేళాలపై దాడులు నిర్వహించి, కేరళ, థాయ్‌లాండ్ వంటి ప్రాంతాలకు గోవులను అక్రమంగా తరలించకుండా కఠిన చర్యలు తీసుకోనుంది. పీ-4 విధానంలో మాంసాభివృద్ధి సంస్థ ద్వారా మున్సిపాలిటీలు, పంచాయతీల్లో ఒక్కో మోడల్ దుకాణం చొప్పున ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే పశువుల సంతలను కూడా పర్యవేక్షించి, అక్కడ కూడా నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోనుంది. ఈ చర్యల ద్వారా ప్రజలకు నాణ్యమైన మాంసాన్ని అందుబాటులోకి తెచ్చి.. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నాణ్యతలేని చికెన్, మటన్ కారణంగా ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు.. ఈ క్రమంలోనే రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ రంగంలోకి దిగింది. ప్రజలకు నాణ్యమైన మాంసం అందించే దిశగా అడుగులు వేస్తోంది.. అందుకే ఈ కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో చికెన్‌షాపులు, విక్రయాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. చికెన్ వ్యాపారంలో అక్రమాలను అరికట్టేందుకు కొత్త లైసెన్సింగ్ విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది.l
రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ, చికెన్ వ్యాపారంలో పారదర్శకతను పెంచడానికి ఈ లైసెన్సింగ్ విధానాన్ని ప్రవేశపెడుతోంది. దీని ద్వారా ప్రతి చికెన్ దుకాణానికి లైసెన్స్ తప్పనిసరి అవుతుంది. ఈ లైసెన్స్ ద్వారా కోళ్ల సప్లై చైన్‌ను పూర్తిగా పర్యవేక్షించవచ్చు. పౌల్ట్రీ ఫారాల నుంచి కోళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, షాపుల యజమానులు ఎవరికి అమ్ముతున్నారు అనే విషయాలను ట్రాక్ చేసేలా పక్కా వ్యవస్థను ఏర్పాటు చేయాలని రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ బోర్డు తీర్మానించింది. ఈ సమాచారం అంతా నమోదు చేస్తారు.

ఈ మేరకు విజయవాడలో పశు సంవర్ధకశాఖ డైరెక్టర్ కార్యాలయంలో సంస్థ ఛైర్మన్ చంద్ర దండు ప్రకాష్‌నాయుడు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. డైరెక్టర్లు ప్రవీణ, అజ్ముద్దీన్, పశు సంవర్ధక శాఖ సంచాలకులు టి.దామోదర్‌నాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు. గతంలో జరిగిన మాంసం మాఫియా అక్రమాలపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించారు.ఈ కొత్త విధానం చికెన్ వ్యాపారంలో అక్రమాలకు అడ్డుకట్ట వేస్తుందని అధికారులు భావిస్తున్నారు.

ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా, రాష్ట్ర ప్రభుత్వం మాంసం దుకాణాల క్రమబద్ధీకరణపై దృష్టి సారించింది. మున్సిపాలిటీల్లో మాంసం దుకాణాలపై ఆకస్మిక దాడులు చేసి, అక్రమాలను అరికట్టాలని నిర్ణయించింది. హోటల్స్, రెస్టారంట్ల నిర్వాహకులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన చికెన్ షాపుల నుంచే మాంసం కొనుగోలు చేసేలా ప్రోత్సహించడంతో పాటు, స్టెరాయిడ్లు వాడిన కోళ్ల అమ్మకాలను పూర్తిగా నియంత్రించనుంది. చికెన్ షాపుల్లో వ్యర్థాలను చేపలకు ఆహారంగా వాడుతున్న మాఫియాను అరికట్టి, ప్రజారోగ్యానికి ఇబ్బంది కలగకుండా వ్యర్థాలను సేకరించి, సురక్షితంగా పారవేయాలని ఆదేశించింది.

అక్రమ కబేళాలపై దాడులు నిర్వహించి, కేరళ, థాయ్‌లాండ్ వంటి ప్రాంతాలకు గోవులను అక్రమంగా తరలించకుండా కఠిన చర్యలు తీసుకోనుంది. పీ-4 విధానంలో మాంసాభివృద్ధి సంస్థ ద్వారా మున్సిపాలిటీలు, పంచాయతీల్లో ఒక్కో మోడల్ దుకాణం చొప్పున ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే పశువుల సంతలను కూడా పర్యవేక్షించి, అక్కడ కూడా నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోనుంది. ఈ చర్యల ద్వారా ప్రజలకు నాణ్యమైన మాంసాన్ని అందుబాటులోకి తెచ్చి.. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నాణ్యతలేని చికెన్, మటన్ కారణంగా ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు.. ఈ క్రమంలోనే రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ రంగంలోకి దిగింది. ప్రజలకు నాణ్యమైన మాంసం అందించే దిశగా అడుగులు వేస్తోంది.. అందుకే ఈ కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.