చేజర్ల సెప్టెంబరు (పున్నమి ప్రతినిధి)
చేజర్ల మండల చేజర్ల గ్రామపంచాయతీలోని ఎస్.సి. కాలనీలో నీ ఆంజనేయ స్వామి గుడి అభివృద్ధి సహకరించాలని టిడిపి పార్టీ మండల దళిత నాయకులు సోమవరపు హజరత్తయ్య రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డిని కోరడంతో ఆయన స్పందించి ఆలయ అభివృద్ధికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అభివృద్ధికి సహకరించిన పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డికి టిడిపి పార్టీ సీనియర్ నాయకులు తాళ్లూరు గిరినాయుడుకి కాలనీవాసులు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆత్మకూరు సుబ్బరాయుడు, తిరుపతయ్య, అర్జున్ కుమార్, కాకుమూరు జయరామయ్య, బర్రెల దొరబాబు, కాలనీ పెద్దలు పాల్గొన్నారు.


