చిట్వేల్, అక్టోబర్ 10 (పున్నమి ప్రతినిధి)
రైల్వే కోడూరు మండలం ఉర్లగడ్డ పొడు అరుంధతి వాడకు చెందిన వేమ్మడి రాధాకృష్ణ బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సమాచారం తెలుసుకున్న రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇంచార్జ్ & కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి కుమారుడు, యువ నాయకుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి శుక్రవారం తిరుపతి సిమ్స్ హాస్పిటల్‌కు చేరుకుని రాధాకృష్ణ పరామర్శించారు.సాయి వికాస్ రెడ్డి వైద్యుల నుండి ఆరోగ్య పరిస్థితిని సమగ్రంగా తెలుసుకొని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఆత్మస్థైర్యంగా ఉండాలని సూచించారు. అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు అందేలా తానే కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ సందర్బంగా స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు కూడా పాల్గొన్నారు.


