Sunday, 22 March 2026
  • Home  
  • అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: ధనియాకుల వెంకట్ నారాయణ పిలుపు
- ఖమ్మం

అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: ధనియాకుల వెంకట్ నారాయణ పిలుపు

ఖమ్మం, మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి): తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అరాచక పాలనను నిరసిస్తూ నిర్వహించనున్న “అసెంబ్లీ ముట్టడి” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఖమ్మం బీజేపీ టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు నాయకత్వంలో సోమవారం (23వ తేదీ) జరగనున్న ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొనాలని ఆయన కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న కమీషన్ల పాలన, ప్రజల జీవనంపై పడుతున్న ప్రభావం, భావితరాల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్న పరిస్థితులపై నిరసన వ్యక్తం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. కాబట్టి జిల్లా, పట్టణ స్థాయి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఖమ్మం, మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి):

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అరాచక పాలనను నిరసిస్తూ నిర్వహించనున్న “అసెంబ్లీ ముట్టడి” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఖమ్మం బీజేపీ టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ పిలుపునిచ్చారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు నాయకత్వంలో సోమవారం (23వ తేదీ) జరగనున్న ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొనాలని ఆయన కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న కమీషన్ల పాలన, ప్రజల జీవనంపై పడుతున్న ప్రభావం, భావితరాల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్న పరిస్థితులపై నిరసన వ్యక్తం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు.

కాబట్టి జిల్లా, పట్టణ స్థాయి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.