నకిరేకల్ : నవంబర్ ( పున్నమి ప్రతినిధి )
స్వయం సహాయక మహిళ సంఘాలకు మూడో విడత వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం కు హాజరుకానున్న మంత్రులు, ఎంపీలు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు. రాష్ట్రంలోనే అత్యధికంగా 26. 34 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు నల్గొండ జిల్లాకు కేటాయింపు, నల్గొండ జిల్లాలో వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు ఇదివరకే రెండు విడతల్లో వడ్డీలేని రుణాల పంపిణీ చేయగా, మంగళవారం మరోసారి మూడో విడత పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలను పంపిణీ చేయనుంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 304 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను, స్వయం సహాయక మహిళా సంఘాలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది . ఈ విషయంపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సోమవారం హైదరాబాదు నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, డిఆర్డిఓ లు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ విషయాలను తెలియజేశారు.

అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమం కు హాజరుకానున్న :మంత్రులు
నకిరేకల్ : నవంబర్ ( పున్నమి ప్రతినిధి ) స్వయం సహాయక మహిళ సంఘాలకు మూడో విడత వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం కు హాజరుకానున్న మంత్రులు, ఎంపీలు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు. రాష్ట్రంలోనే అత్యధికంగా 26. 34 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు నల్గొండ జిల్లాకు కేటాయింపు, నల్గొండ జిల్లాలో వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు ఇదివరకే రెండు విడతల్లో వడ్డీలేని రుణాల పంపిణీ చేయగా, మంగళవారం మరోసారి మూడో విడత పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలను పంపిణీ చేయనుంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 304 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను, స్వయం సహాయక మహిళా సంఘాలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది . ఈ విషయంపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సోమవారం హైదరాబాదు నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, డిఆర్డిఓ లు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ విషయాలను తెలియజేశారు.

