Thursday, 5 February 2026
  • Home  
  • అవినీతి నిర్మూలనపై జీవీఎంసీ కమిషనర్ ఉక్కు పాదం.
- విశాఖపట్నం

అవినీతి నిర్మూలనపై జీవీఎంసీ కమిషనర్ ఉక్కు పాదం.

అవినీతి నిర్మూలనపై జీవీఎంసీ కమిషనర్ ఉక్కు పాదం. • జీవీఎంసీ లో అవినీతిరహిత విధానం దిశగా చర్యలు. విశాఖపట్నం డిసెంబర్మ 10 పున్నమి ప్రతినిధి :-మహా విశాఖపట్నం నగరపాలక సంస్థలో అవినీతి నిర్మూలనకు తావు లేకుండా , అవినీతి రహిత విధానం అమలు దిశగా కఠిన చర్యలు చేపట్టడం జరుగుచున్నదని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ మంగళవారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. జీవీఎంసీ లో అవినీతి నిర్మూలన దిశగా కఠినమైన విధానాన్ని కచ్చితంగా అమలు చేస్తున్నామని, జీవీఎంసీలో ఎవరైనా అవినీతికి పాల్పడినట్లయితే కఠిన చర్యలతో పాటు చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగునని కమిషనర్ తెలిపారు. ఇప్పటికే పలు ఆరోపణలపై ఒక ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ సేవలను సరెండర్ చేశామని, ఒక సహాయక ఇంజనీర్‌పై విచారణకు ఆదేశాలు జారీ చేసామని, ఒక టీపీవో (Town Planning Officer) సేవలను కూడా సరెండర్ చేయడం జరిగిందని తెలిపారు. పౌర సేవల్లో పారదర్శకత, నిష్పాక్షికత కోసం జీవీఎంసీ ఎటువంటి అవినీతి చర్యలను ఉపేక్షించదని కమిషనర్ స్పష్టం చేశారు. అవినీతిలో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హితవు పలికారు. జీవీఎంసీ అధికారులు ,ఇంజనీర్లు ,ఉద్యోగులు ,సిబ్బంది అవినీతి రహితంగా, విశాఖ నగర అభివృద్ధి దిశగా చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేయడమైనదని కమిషనర్ తెలిపారు.

అవినీతి నిర్మూలనపై జీవీఎంసీ కమిషనర్ ఉక్కు పాదం.

• జీవీఎంసీ లో అవినీతిరహిత విధానం దిశగా చర్యలు.

విశాఖపట్నం డిసెంబర్మ 10 పున్నమి ప్రతినిధి :-మహా విశాఖపట్నం నగరపాలక సంస్థలో అవినీతి నిర్మూలనకు తావు లేకుండా , అవినీతి రహిత విధానం అమలు దిశగా కఠిన చర్యలు చేపట్టడం జరుగుచున్నదని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ మంగళవారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.

జీవీఎంసీ లో అవినీతి నిర్మూలన దిశగా కఠినమైన విధానాన్ని కచ్చితంగా అమలు చేస్తున్నామని, జీవీఎంసీలో ఎవరైనా అవినీతికి పాల్పడినట్లయితే కఠిన చర్యలతో పాటు చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగునని కమిషనర్ తెలిపారు.

ఇప్పటికే పలు ఆరోపణలపై ఒక ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ సేవలను సరెండర్ చేశామని, ఒక సహాయక ఇంజనీర్‌పై విచారణకు ఆదేశాలు జారీ చేసామని,
ఒక టీపీవో (Town Planning Officer) సేవలను కూడా సరెండర్ చేయడం జరిగిందని తెలిపారు.
పౌర సేవల్లో పారదర్శకత, నిష్పాక్షికత కోసం జీవీఎంసీ ఎటువంటి అవినీతి చర్యలను ఉపేక్షించదని కమిషనర్ స్పష్టం చేశారు. అవినీతిలో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హితవు పలికారు. జీవీఎంసీ అధికారులు ,ఇంజనీర్లు ,ఉద్యోగులు ,సిబ్బంది అవినీతి రహితంగా, విశాఖ నగర అభివృద్ధి దిశగా చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేయడమైనదని కమిషనర్ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.