Thursday, 5 February 2026
  • Home  
  • అవయవ దానమే – జీవదానం : ఎంపీ ఉదయ్ శ్రీనివాస్.
- కాకినాడ

అవయవ దానమే – జీవదానం : ఎంపీ ఉదయ్ శ్రీనివాస్.

పున్నమి న్యూస్,కాకినాడ జిల్లా,కాకినాడ సిటీ: నవంబర్ 9: జీవనదాన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో “అవయవ దానం అవగాహన కార్యక్రమం” ఆదివారం కాకినాడలో విజయవంతంగా నిర్వహించబడింది. ఉదయం అపోలో హాస్పిటల్, కాకినాడ వద్ద వందలాది మంది వైద్యులు, నర్సులు, విద్యార్థులు, సామాజిక సేవకులు, మరియు ప్రజలు పాల్గొని వాక్‌థాన్ నిర్వహించారు. ఈ వాక్‌థాన్ ఫాబిన్ కన్వెన్షన్ హాల్ వరకు సాగి, ప్రజల్లో అవయవ దానం ప్రాముఖ్యతపై విశేష అవగాహన కలిగించింది.తదుపరి జరిగిన ప్రధాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ (ఎంపీ, కాకినాడ) పాల్గొన్నారు. అవయవదానం ద్వారా మరొకరి జీవితాన్ని కాపాడటం అత్యున్నతమైన సేవ అని అన్నారు. గౌరవ అతిథులుగా కె. పద్మశ్రీ (ఎంఎల్‌సి) పాల్గొని అవయవదానం యొక్క సామాజిక ప్రాధాన్యతను వివరించారు.ప్రత్యేక ఆహ్వానితులుగా డా. లవణ్య కుమారి (సూపరింటెండెంట్, జిజిహెచ్), డా. ఏ. విష్ణువర్ధన్ (ప్రిన్సిపల్, రంగారాయ మెడికల్ కాలేజ్), డా. కె. బాబ్జీ మాజీ సంచాలకులు మరియు వైద్య విద్యా రంగ ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమంలో డా. రామకృష్ణ మరియు డా. సోమయాజులు (ట్రస్ట్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్), సుభాకర్ (మెడికవర్ హాస్పిటల్స్), మరియు డా. జి.వి. రావు (అపోలో హాస్పిటల్స్) కూడా పాల్గొని అవయవదానంపై విలువైన అభిప్రాయాలు వ్యక్తపరిచారు. డా. కె. రాంబాబు, డైరెక్టర్, వీఐఎంఎస్ మరియు సీటీసీ జీవనదాన్ ఏపీ, ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు, అవయవదాత కుటుంబాలకు సన్మానాలు, మరియు అవగాహన ప్రసంగాలు జరిగాయి. పాల్గొన్నవారందరూ “అవయవ దానం – జీవదానం” అనే నినాదంతో ప్రేరణ పొందారు. జీవనదాన్ ఏపీ తరపున అధికారులు, వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు మరియు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

పున్నమి న్యూస్,కాకినాడ జిల్లా,కాకినాడ సిటీ: నవంబర్ 9:
జీవనదాన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో “అవయవ దానం అవగాహన కార్యక్రమం” ఆదివారం కాకినాడలో విజయవంతంగా నిర్వహించబడింది.
ఉదయం అపోలో హాస్పిటల్, కాకినాడ వద్ద వందలాది మంది వైద్యులు, నర్సులు, విద్యార్థులు, సామాజిక సేవకులు, మరియు ప్రజలు పాల్గొని వాక్‌థాన్ నిర్వహించారు. ఈ వాక్‌థాన్ ఫాబిన్ కన్వెన్షన్ హాల్ వరకు సాగి, ప్రజల్లో అవయవ దానం ప్రాముఖ్యతపై విశేష అవగాహన కలిగించింది.తదుపరి జరిగిన ప్రధాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ (ఎంపీ, కాకినాడ) పాల్గొన్నారు. అవయవదానం ద్వారా మరొకరి జీవితాన్ని కాపాడటం అత్యున్నతమైన సేవ అని అన్నారు.
గౌరవ అతిథులుగా కె. పద్మశ్రీ (ఎంఎల్‌సి) పాల్గొని అవయవదానం యొక్క సామాజిక ప్రాధాన్యతను వివరించారు.ప్రత్యేక ఆహ్వానితులుగా డా. లవణ్య కుమారి (సూపరింటెండెంట్, జిజిహెచ్), డా. ఏ. విష్ణువర్ధన్ (ప్రిన్సిపల్, రంగారాయ మెడికల్ కాలేజ్), డా. కె. బాబ్జీ మాజీ సంచాలకులు మరియు వైద్య విద్యా రంగ ప్రముఖులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో డా. రామకృష్ణ మరియు డా. సోమయాజులు (ట్రస్ట్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్), సుభాకర్ (మెడికవర్ హాస్పిటల్స్), మరియు డా. జి.వి. రావు (అపోలో హాస్పిటల్స్) కూడా పాల్గొని అవయవదానంపై విలువైన అభిప్రాయాలు వ్యక్తపరిచారు.
డా. కె. రాంబాబు, డైరెక్టర్, వీఐఎంఎస్ మరియు సీటీసీ జీవనదాన్ ఏపీ, ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు, అవయవదాత కుటుంబాలకు సన్మానాలు, మరియు అవగాహన ప్రసంగాలు జరిగాయి. పాల్గొన్నవారందరూ “అవయవ దానం – జీవదానం” అనే నినాదంతో ప్రేరణ పొందారు.
జీవనదాన్ ఏపీ తరపున అధికారులు, వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు మరియు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.