విశాఖపట్నం అక్టోబర్ పు న్నమి ప్రతినిధి:
తెలుగుదండు ఆధ్వర్యవంలో, మద్దిలపాలెం కూడలి తెలుగుతల్లి విగ్రహం వద్ద..”అక్షతులైరి… ఆంధ్రులు” అంటూ..పలువురు సాహితీవేత్తలు, భాషాభిమానులతో తెలుగుదండు అధ్యక్షుడు పరవస్తు ఫణిశయన సూరి తెలుగు తల్లికి పూలమాల సమర్పించి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ విడుదల చేశారు.
లేఖాంశాలు..
అయ్యా..!ఈ సంవత్సరం నుంచి అయినా “నవంబరు-1″న మన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించండి. కనీసం.. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించలేని మీరు ఆంధ్రప్రదేశ్ ను ఉద్ధరిస్తామంటే ఎలా నమ్మగలం..? ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిందేగాని, మన రాష్ట్రం కాదు. కాబట్టి.. నవంబరు-1వ తేదీ యథావిధిగా మన రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఇందులో ఎటువంటి తబ్బిబ్బు లేదు. గతంలో కూడా మీరు మీమాట నెగ్గించుకొనుటకు ఆంధ్రప్రదేశ్ కు అవతరణ దినోత్సవం నిర్వహించకుండానే..మీరు కూడా నిష్క్రమించారు. ఇప్పటికైనా.. భేషజాలకు పోక మామాట మన్నించండి, ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని జరిపించండి.
మరొక్క మనవి.. అధికార భాషా సంఘం స్థానంలో “మాతృభాషాభివృద్ధి ప్రాధికార సంస్థ”ను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసి, తెలుగుభాషను కాపాడగలరని ప్రార్థన. గతంలో అంటే..2014 నుండి 2019 వరకూ కనీసం అధికార భాషా సంఘాన్ని కూడా నియమించక, తెలుగు భాషను అనాథను చేశారు. ఇప్పటికైనా.. భాషావేత్తల , భాషాభిమానుల సూచనలు మన్నించి తెలుగు భాషాభివృద్ధికి బాటలు వేయండి.
కావున మాయందు దయయుంచి, మా మాటలలోని పారుష్యాన్ని మన్నించి.. రేపటి నవంబరు-1న మన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించగరని, మాతృభాషాభివృద్ధి ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయగలరని నమ్ముతున్నాము.


