రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి న్యూస్ ప్రతినిధి
రైల్వేకోడూరు స్థానిక మద్రాస్ రోడ్ లో ఉంటున్న జి ఎస్ కే ట్రేడింగ్ కంపెనీ ఆధ్వర్యంలో ఈరోజు తాపీ మేస్త్రీల సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సమావేశంలో అల్ట్రాటెక్ ఇంజనీర్ చైతన్య మాట్లాడుతూ నూతనంగా నిర్మించబోయే ఇంటి గురించి మరియు నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వారు క్లుప్తంగా వివరించడం జరిగినది. అయితే రైల్వేకోడూరు డీలర్ జి ఎస్ కే ట్రేడింగ్ కంపెనీ గునిశెట్టి సాయికుమార్ మాట్లాడుతూ రైల్వే కోడూరు పరిసర ప్రాంతాల్లో నిర్మించబోయే ఇంటి గురించి మేస్త్రీలకు ఇంటి యజమానులకు ఏ సిమెంట్ వాడాలి ఏ మోతాదులో వాడాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం గురించి ఆయన మేస్త్రీలకు వివరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు తాపీ మేస్త్రి లో బిల్డర్స్ కాంట్రాక్టర్స్ మొదలగువారు పాల్గొనడం జరిగినది.


