గాజువాక, నవంబర్ (పున్నమి ప్రతినిధి):
గాజువాక నియోజకవర్గం 75వ వార్డ్ పరిధిలోని సీతానగరం, దుర్గవానిపాలెం గ్రామాల్లో పింఛన్ లబ్ధిదారులకు కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో పింఛన్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ఏపీ స్టేట్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ మొల్లి పెంటిరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొల్లి పెంటిరాజు మాట్లాడుతూ… త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన పింఛన్లు అందజేయబడతాయి.
ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, ప్రతి వర్గానికీ ప్రభుత్వ సహాయం అందించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉంది,” అని పేర్కొన్నారు.
“ప్రజా సంక్షేమం, పేద ప్రజలకు అండగా ఉండడం – రాష్ట్ర అభివృద్ధి యొక్క ప్రధాన లక్ష్యమని,” అన్నారు.
ఈ కార్యక్రమంలో 75వ వార్డ్ అధ్యక్షుడు నమ్మి అప్పారావు, కార్యదర్శి ములకలపల్లి పెంటయ్య, వార్డ్ క్లస్టర్ ఇంచార్జ్ ఉరుకూటి అప్పలరాజు, విశాఖ జిల్లా తెలుగుయువత ఉపాధ్యక్షుడు మొల్లి రమణబాబు, గాజువాక నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు వంగలపూడి అప్పలరాజు,
టీడీపీ సీనియర్ నాయకులు బొంగురాజు, ఉరుకూటి అప్పారావు, కుమార్,
సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


