Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Warangal

అర్హులైన ప్రతి పట్టభద్రుడు నవంబర్ 6లోపు ఓటరుగా నమోదు చేసుకోవాలి: ఆబోతు అశోక్ యాదవ్

Punnami Newsroom Published:
అర్హులైన ప్రతి పట్టభద్రుడు నవంబర్ 6లోపు ఓటరుగా నమోదు చేసుకోవాలి: ఆబోతు అశోక్ యాదవ్

ఖానాపూర్ క్లస్టర్ పరిధిలోని గ్రామాల అర్హులైన పట్టభద్రులందరూ రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటరుగా నమోదు చేసుకోవాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఖానాపూర్ క్లస్టర్ ఇంచార్జ్ ఆబోతు అశోక్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. 2023 నవంబర్‌కు ముందు డిగ్రీ పూర్తి చేసి, ఎన్నికల నిబంధనల ప్రకారం అర్హత కలిగిన పట్టభద్రులు నవంబర్ 6లోపు ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.
ఖానాపూర్ క్లస్టర్ పరిధిలోని గ్రామాల పట్టభద్రులు తమ ఓటు హక్కును నిర్లక్ష్యం చేయకూడదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాలంటే ముందుగా ఓటరుగా నమోదు కావడం తప్పనిసరి. చివరి తేదీ వరకు వేచి చూడకుండా వెంటనే నమోదు చేసుకోవాలి.
ఓటరు నమోదుకు ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ నంబర్, డిగ్రీ మెమో లేదా డిప్లొమా ధ్రువపత్రం, ఒక పాస్‌పోర్ట్ సైజు ఫోటో, ఫోన్ నంబర్ అవసరం. ఈ పత్రాలను అందించి మనుబోతుల గడ్డ గ్రామంలో ఉచితంగా ఓటరు నమోదు చేసుకోవచ్చు. వివరాలను వాట్సాప్ ద్వారా పంపించి కూడా నమోదు ప్రక్రియలో సహకారం పొందవచ్చు. స్వయంగా దరఖాస్తు చేసుకునేవారు CEO తెలంగాణ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
ప్రశ్నించే హక్కును కోల్పోతే ప్రజాస్వామ్యంలో మన గొంతు బలహీనపడుతుంది. పట్టభద్రుల సమస్యలు, నిరుద్యోగుల ఇబ్బందులు, ఉద్యోగుల హక్కులపై అవగాహన కలిగి వాటి పరిష్కారం కోసం కృషి చేసే నాయకత్వానికి మన ఓటు ద్వారా మద్దతు తెలపాలి.
గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా పట్టభద్రులు చైతన్యంతో వ్యవహరించాలి. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకుని, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాధ్యతతో పాల్గొనాలని కోరుతున్నాను.

అర్హులైన ప్రతి పట్టభద్రుడు నవంబర్ 6లోపు ఓటరుగా నమోదు చేసుకోవాలి: ఆబోతు అశోక్ యాదవ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *