అనంతపురం, ఫిబ్రవరి 06 (పున్నమి ప్రతినిధి):
జిల్లాలో అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేస్తామని కలెక్టర్ మరియు జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ ఓ. ఆనంద్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ మినీ మీటింగ్ హాల్లో జరిగిన తొలి కమిటీ సమావేశంలో 551 అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేశారు. పత్రికలు, పీరియాడికల్స్‌ను క్రమం తప్పకుండా సమర్పించాలని సూచించారు. నిజాయితీగా విధులు నిర్వహించే వారికి మాత్రమే కార్డులు ఇస్తామని స్పష్టం చేశారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి కమిటీ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అర్హులందరికీ అక్రిడిటేషన్ కార్డులు – తొలి విడతలో 551 మంజూరు
అనంతపురం, ఫిబ్రవరి 06 (పున్నమి ప్రతినిధి): జిల్లాలో అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేస్తామని కలెక్టర్ మరియు జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ ఓ. ఆనంద్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ మినీ మీటింగ్ హాల్లో జరిగిన తొలి కమిటీ సమావేశంలో 551 అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేశారు. పత్రికలు, పీరియాడికల్స్‌ను క్రమం తప్పకుండా సమర్పించాలని సూచించారు. నిజాయితీగా విధులు నిర్వహించే వారికి మాత్రమే కార్డులు ఇస్తామని స్పష్టం చేశారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి కమిటీ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

