Wednesday, 30 July 2025
  • Home  
  • అర్హతే ప్రామాణికంగా ఇళ్ళస్ధలాలు పంపిణీ : ఎమ్మెల్యే కాకాణి
- Featured

అర్హతే ప్రామాణికంగా ఇళ్ళస్ధలాలు పంపిణీ : ఎమ్మెల్యే కాకాణి

21-07-2020 మనుబోలు (పున్నమి ప్రతినిధి ) మనుబోలు మండల పరిషత్ కార్యాలయంలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పధకంపై అధికారులతో సమీక్షించి, ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు. ఎమ్మెల్యే కాకాని మాట్లాడుతూ ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో ఎక్కడా ఇబ్బందులు లేకుండా సమీక్షలు నిర్వహించి, సమస్యలు గుర్తించి అర్హులైన ప్రతి కుటుంబానికీ ఇళ్ల పట్టాలు అందించడమే ధ్యేయంగా పనిచేస్తున్నము పట్టాల పంపిణీలో రాజకీయాలకు అతీతంగా, పారదర్శకంగా పంపిణీ చేస్తామని అన్నారు అధికారులు అనర్హులుగా ఉన్న వారి పేర్లు జాబితా నుండి తొలగించి, అర్హులకు న్యాయం చేసేందుకు కృషి చేయాలి అన్నారు గ్రామాల్లో అర్హత ఉండి సాంకేతిక లోపంతో పేరు మంజూరు కాకపోయినా, వారికి కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అధికారులకు సూచించామని అన్నారు బడాబాబుల కబంధ హస్తాల చెరలో ఉన్న భూములను విడిపించి, అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు అందివ్వడం జరుగుతుందని అన్నారు సర్వేపల్లి నియోజకవర్గంలో జాతీయ రహదారి పక్కన ఉన్న కోట్ల రూపాయలు విలువ చేసే అత్యంత ఖరీదైన భూములలో లేఅవుట్లు అభివృద్ధి చేసి, పేదలకు ఇళ్ల స్థలాలు అందిస్తున్నాం. కోర్టులకు వెళ్లిన స్థలాలకు సంబంధించి, వాస్తవాలను న్యాయస్థానం దృష్టికి తీసుకొని వెళ్లి, స్థలాలను సేకరించి, పేదలకు ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేస్తాం. గ్రామాలలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందడం ఇష్టంలేని కొంతమంది వ్యక్తులు అడ్డుపడుతూ గ్రామాల్లో చిచ్చు రేపుతున్నారు అన్నారు. గత ప్రభుత్వాలలో వివాదాస్పద భూములకు పట్టాలు ఇచ్చి, పట్టాలు పేద వాడి చేతిలో ఉంటే, భూములు బడాబాబుల ఆధీనంలో ఉన్నాయి. పట్టా ఇవ్వడమే కాకుండా ఇళ్ల స్థలాన్ని చూపించి, శాశ్వత ప్రాతిపదికన ఇళ్ల నిర్మాణం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు చేపడుతున్నారు. గ్రామాల్లో ఇళ్ల పట్టాల ఎంపికలో ఎక్కడా పొరపాట్లు లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారుల పై ఉంది. అన్ని స్థాయిలలోని అధికారులు ఇళ్ల స్థలాలను గుర్తించి, పంపిణీ చేయడానికి విశేషంగా కృషి చేస్తూ, నిరంతరం కష్టపడుతున్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అర్హతే ప్రామాణికంగా ఇళ్ళ స్ధలాలను పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే కాకాణి స్పష్టం చేశారు. పార్టీ లతో సంబందంలేకుండా అర్హత గలిగిన ప్రతిపేదవాడికి ఆగస్టు 15న ఇళ్ళపట్టాలు అందచేస్తామన్నారు. అదేవిధంగా అనర్హులను జాబితా నుండి తొలగిస్తామన్నారు. గ్రామాల్లో ఇళ్శ స్ధలంలేదు అని ఏఒక్క అర్జీకూడా రాకూడదని ముఖ్యంగా విఆర్వో లు పారదర్శకంగా పనిచేయాలని లేదంటే మూల్యం చెల్లించుకుంటారన్నారు. రేషన్ కార్డు లేనివారికి ఇళ్ళస్ధలాలు రిజర్వ్ లో వుంచి కార్డులు వచ్చాక పంపిణీ చేస్తామన్నారు. మండలంలోని 19 పంచాయతీ లలో చెర్లోపల్లి, వెంకన్నపాలెం లో సమస్యలు అధికమించామని ఇంకా చిన్న చిన్న సమస్యలు వున్నాయని వాటిని కూడా అధికమిస్తామని పేర్కొన్నారు. ప్రతిపేదవాడికి ఇళ్ళు ఇవ్వాలనే లక్ష్యం తో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందుకుసాగుతున్నారని టీడీపీ మాత్రం ఏవిధంగా బురదజల్లాలని ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. అంతకముందు గ్రామాలవారిగా అధికారులు నాయకులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం పలుసమస్యలపై అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలోబొమ్మి రెడ్డి హరగోపాల్ రెడ్డి,కడివేటి చంద్ర శేఖర్ రెడ్డి, బాస్కర్ గౌడ్, సుధీర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి,దాసరి మహేంద్ర వర్మ ,శివకుమార్ రెడ్డి, ఆదినారాయణ ,తులసి ,రమేష్, రాజా వైఎస్ఆర్సిపి నాయకులు అన్నిశాఖల అధికారులు పాల్గొన్నారు.


21-07-2020 మనుబోలు (పున్నమి ప్రతినిధి )
మనుబోలు మండల పరిషత్ కార్యాలయంలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పధకంపై అధికారులతో సమీక్షించి, ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు. ఎమ్మెల్యే కాకాని మాట్లాడుతూ ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో ఎక్కడా ఇబ్బందులు లేకుండా సమీక్షలు నిర్వహించి, సమస్యలు గుర్తించి అర్హులైన ప్రతి కుటుంబానికీ ఇళ్ల పట్టాలు అందించడమే ధ్యేయంగా పనిచేస్తున్నము పట్టాల పంపిణీలో రాజకీయాలకు అతీతంగా, పారదర్శకంగా పంపిణీ చేస్తామని అన్నారు
అధికారులు అనర్హులుగా ఉన్న వారి పేర్లు జాబితా నుండి తొలగించి, అర్హులకు న్యాయం చేసేందుకు కృషి చేయాలి అన్నారు
గ్రామాల్లో అర్హత ఉండి సాంకేతిక లోపంతో పేరు మంజూరు కాకపోయినా, వారికి కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అధికారులకు సూచించామని అన్నారు
బడాబాబుల కబంధ హస్తాల చెరలో ఉన్న భూములను విడిపించి, అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు అందివ్వడం జరుగుతుందని అన్నారు
సర్వేపల్లి నియోజకవర్గంలో జాతీయ రహదారి పక్కన ఉన్న కోట్ల రూపాయలు విలువ చేసే అత్యంత ఖరీదైన భూములలో లేఅవుట్లు అభివృద్ధి చేసి, పేదలకు ఇళ్ల స్థలాలు అందిస్తున్నాం.
కోర్టులకు వెళ్లిన స్థలాలకు సంబంధించి, వాస్తవాలను న్యాయస్థానం దృష్టికి తీసుకొని వెళ్లి, స్థలాలను సేకరించి, పేదలకు ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేస్తాం.
గ్రామాలలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందడం ఇష్టంలేని కొంతమంది వ్యక్తులు అడ్డుపడుతూ గ్రామాల్లో చిచ్చు రేపుతున్నారు అన్నారు.
గత ప్రభుత్వాలలో వివాదాస్పద భూములకు పట్టాలు ఇచ్చి, పట్టాలు పేద వాడి చేతిలో ఉంటే, భూములు బడాబాబుల ఆధీనంలో ఉన్నాయి.
పట్టా ఇవ్వడమే కాకుండా ఇళ్ల స్థలాన్ని చూపించి, శాశ్వత ప్రాతిపదికన ఇళ్ల నిర్మాణం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు చేపడుతున్నారు.
గ్రామాల్లో ఇళ్ల పట్టాల ఎంపికలో ఎక్కడా పొరపాట్లు లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారుల పై ఉంది.
అన్ని స్థాయిలలోని అధికారులు ఇళ్ల స్థలాలను గుర్తించి, పంపిణీ చేయడానికి విశేషంగా కృషి చేస్తూ, నిరంతరం కష్టపడుతున్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అర్హతే ప్రామాణికంగా ఇళ్ళ స్ధలాలను పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే కాకాణి స్పష్టం చేశారు. పార్టీ లతో సంబందంలేకుండా అర్హత గలిగిన ప్రతిపేదవాడికి ఆగస్టు 15న ఇళ్ళపట్టాలు అందచేస్తామన్నారు. అదేవిధంగా అనర్హులను జాబితా నుండి తొలగిస్తామన్నారు. గ్రామాల్లో ఇళ్శ స్ధలంలేదు అని ఏఒక్క అర్జీకూడా రాకూడదని ముఖ్యంగా విఆర్వో లు పారదర్శకంగా పనిచేయాలని లేదంటే మూల్యం చెల్లించుకుంటారన్నారు. రేషన్ కార్డు లేనివారికి ఇళ్ళస్ధలాలు రిజర్వ్ లో వుంచి కార్డులు వచ్చాక పంపిణీ చేస్తామన్నారు. మండలంలోని 19 పంచాయతీ లలో చెర్లోపల్లి, వెంకన్నపాలెం లో సమస్యలు అధికమించామని ఇంకా చిన్న చిన్న సమస్యలు వున్నాయని వాటిని కూడా అధికమిస్తామని పేర్కొన్నారు. ప్రతిపేదవాడికి ఇళ్ళు ఇవ్వాలనే లక్ష్యం తో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందుకుసాగుతున్నారని టీడీపీ మాత్రం ఏవిధంగా బురదజల్లాలని ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. అంతకముందు గ్రామాలవారిగా అధికారులు నాయకులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం పలుసమస్యలపై అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలోబొమ్మి రెడ్డి హరగోపాల్ రెడ్డి,కడివేటి చంద్ర శేఖర్ రెడ్డి, బాస్కర్ గౌడ్, సుధీర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి,దాసరి మహేంద్ర వర్మ ,శివకుమార్ రెడ్డి, ఆదినారాయణ ,తులసి ,రమేష్, రాజా వైఎస్ఆర్సిపి నాయకులు అన్నిశాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.