Friday, 27 March 2026
  • Home  
  • అర్బన్ సచివాలయాల లోనూ.. రీడింగ్ రూమ్స్ కల్పించాలి* లైబ్రరీబకాయిలు పెరగకుండా సెస్ నేరుగా జమయ్యే వికేంద్రీకరణ చేపట్టాలి.. మంత్రి లోకేష్ కు పౌరసంఘం సూచనలు
- E-పేపర్

అర్బన్ సచివాలయాల లోనూ.. రీడింగ్ రూమ్స్ కల్పించాలి* లైబ్రరీబకాయిలు పెరగకుండా సెస్ నేరుగా జమయ్యే వికేంద్రీకరణ చేపట్టాలి.. మంత్రి లోకేష్ కు పౌరసంఘం సూచనలు

ఏపి లో ప్రతి భవనం పైన విథించే మునిసిపల్ ఆస్తి పన్ను మీద అదనంగా రేట్ పేయర్ నుండి 8శాతం గ్రంథాలయం పన్ను వసూలు చేయిస్తున్న ప్రభుత్వం వాటిని నేరుగా గ్రంథాలయ సంస్థలకు బదిలీ లేకుండా వహిస్తున్న విధానం వలన గ్రంధాలయాలు పూర్తిగా నాశనం అవుతున్నాయని పౌర సంఘం ఆక్షేపణ వ్యక్తం చేసింది. ఇటీవల మంత్రి లొకేష్ మాట్లాడుతూ గ్రామ సచివాలయాలలో రీడింగ్ రూమ్స్ ఏర్పాటు చేస్తామని తెలపడం ముదావహం కాగా గ్రంధాలయం సెస్ నేరుగా జమ చేసే ప్రభుత్వం చర్యలు జరగాలని కోరారు. తూర్పు గోదావరి జిల్లా 3 జిల్లాలుగా వేరయినా గ్రంథాలయం సంస్థ మాత్రం అతి గతి లేకుండా వికేంద్రీకరణ కాలేదన్నారు. కాకినాడ కేంద్ర గ్రంథాలయంతో ఉమ్మడి జిల్లాగా 102 శాఖా గ్రంథాలయాలు 14 గ్రామీణ గ్రంథాలయాలు 145 పుస్తక నిక్షిప్త కేంద్రాలుండగా వసతి సమస్యలతో కాకినాడ శ్రీనగర్‌ శాఖా గ్రంథాలయం జగన్నాథపురం బాలల గ్రంథాలయం మూతపడ్డాయన్నారు. రాజమహేంద్రవరం నగర పాలక సంస్థతో బాటుగా జిల్లాలోని పురపాలక సంఘాలు గ్రామ పంచాయితీల నుంచి 50కోట్ల పై మేరకు గ్రంథాలయ బకాయిలున్నా యన్నారు. జిల్లా సంస్థలో 142 ఉద్యోగ ఖాళీలున్నాయ న్నారు. ఔట్‌ సోర్సింగ్‌ అదనపు సిబ్బంది 50 పోస్టులు భర్తీ కాలేదన్నారు . జిల్లా భవనం శిథిలమై అంచనా పనులు రూపొందినా నిథుల లేమితో అభివృద్ది జరగడం లేదన్నారు. గ్రంథాలయం సెస్ ను నేరుగా రేట్ పేయర్ చెల్లించిన వెంటనే జిల్లా గ్రంథాలయ సంస్థ ఖజానా కు జమయ్యే విథానాలు చట్ట పరంగా రూపొందించాలని పార సంఘం అధ్యక్షుడు దూసర్లపూడి రమణరాజు కోరారు. బకాయిలు విడుదల చేయలని కాకినాడ సిటీ లో కూడా సచివాలయం వారీగా రీడింగ్ రూమ్స్ ఏర్పాటు చేయించాలన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.