పెరవలి : నేలకొరిగిన అరటి తోట సందర్శించి రైతులను పరామర్శించిన పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, నిడదవోలు మాజీ శాసనసభ్యులు జి శ్రీనివాస నాయుడు.
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో అరటి పంటకు అపార నష్టం వాటిల్లింది. మరో నెల రోజుల్లో చేతికందే అరటి మట్టి కొట్టుకుపోయింది. రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, జి శ్రీనివాస్ నాయుడు గురువారం నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం ముక్కామల తదితర గ్రామాల్లో తుపాన్ కు నష్టపోయిన అరటి తోటలను పరిశీలించి బాధిత రైతులను పరామర్శించారు. రైతులను ఓదార్చారు.
ఈ సందర్భంగా గూడూరి శ్రీనివాస్, శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ నష్టపోయిన రైతులను తక్షణం ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. పంట నష్టాన్ని సత్వరం అంచనాలు వేసి రైతులను ఆదుకోవాలన్నారు. రైతుల సంక్షేమానికి విశేషంగా కృషి చేసిన ఘనత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. రైతు భరోసా.. క్రాఫ్ ఇన్సూరెన్స్.. ఇన్ఫిట్ సబ్సిడీ.. సకాలంలో ఎరువులు పంపిణీ వంటి సర్వీస్ లన్నీ కూడా చేయడం జరిగిందన్నారు. చేతి కందే పంట అంతా నష్టపోవడం జరిగిందన్నారు. వైఎస్ఆర్సిపి రైతుల వెంట ఉంటుందన్నారు. అనంతరం ఉపాధి కోల్పోయిన పేదలకు బియ్యం, నగదు సాయం అందించారు.


