సీతారామరాజు జిల్లా, అరకు వేలి మండలం, చినలబుడు పంచాయతీ, పకనకుడి గ్రామం
అరకు కాఫీ తోటల్లో కాఫీ గింజలకు సోకిన వైరస్ కారణంగా తీవ్రంగా నష్టపోతున్న రైతుల సమస్యలను తెలుసుకునేందుకు, గిరిజన శాఖ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు, జిల్లా కలెక్టర్ గారు చినలబుడు పంచాయతీలోని పకనకుడి గ్రామానికి విచ్చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అరకు పార్లమెంట్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మొస్య ప్రేమ్ కుమార్, స్వామి జగన్ గారు కాఫీ రైతుల తరపున సమస్యలను వివరించారు.
ప్రధానంగా వారు వినిపించిన సమస్యలు:
5వ షెడ్యూల్ ఆదివాసీ ప్రాంతానికి సంబంధించిన చట్టాన్ని ఉల్లంఘిస్తూ, ఇతర వ్యక్తులు, మల్టీనేషనల్ కంపెనీలు, దళారీలు, సంస్థలు ఆదివాసీ భూములు, ఆస్తులు, వ్యాపారాల్లో జోక్యం చేసుకుంటున్నారని తెలిపారు. సమతా జడ్జిమెంట్ ద్వారా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పట్టించుకోకుండా ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్లే వైరస్ వంటి సమస్యలు పెరిగినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆదివాసీల ఆర్థిక అభివృద్ధికి ప్రపంచ గుర్తింపు పొందిన అరకు కాఫీ పంటను ఉపయోగించి, మండల కేంద్రాల్లో కాఫీ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.
కాఫీ మార్కెటింగ్‌లో ఆదివాసీలకు ప్రాధాన్యత ఇచ్చేందుకు జిసిసి, ఐటిడిఏ ద్వారా స్థానిక యువతకు అనుమతులు ఇచ్చి, కాఫీ హౌసులు, కాఫీ మ్యూజియంలు, కాఫీ షాపులు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.
వైరస్ కారణంగా నష్టపోతున్న రైతులకు ప్రభుత్వం ప్రకటించిన కేజీకి రూ.50 నష్టపరిహారం సరిపోదని, దీనిని పెంచి తగిన నష్టపరిహారం చెల్లించాలని కోరారు.
అనధికారికంగా కాఫీ కొనుగోలు చేస్తున్న దళారీలు, సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, జీఎస్టీ లేకుండా, లైసెన్సులు లేకుండా, అనుమతులు లేకుండా కాఫీని కొనుగోలు చేస్తున్న వారిని గుర్తించి శిక్షించాలన్నారు.
వైరస్ నివారణ చర్యలను వేగవంతం చేసి, దీనికి కారణమైన కుట్రలను వెలుగులోకి తెచ్చి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి, కాఫీ రైతులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున నాయకులు, అధికారులు, స్థానిక కాఫీ రైతులు, గ్రామస్తులు హాజరయ్యారు.

అరకు కాఫీ తోటల్లో కాఫీ గింజలకు సోకిన వైరస్ పై గిరిజన శాఖ మంత్రి & జిల్లా కలెక్టర్ పరిశీలన
సీతారామరాజు జిల్లా, అరకు వేలి మండలం, చినలబుడు పంచాయతీ, పకనకుడి గ్రామం అరకు కాఫీ తోటల్లో కాఫీ గింజలకు సోకిన వైరస్ కారణంగా తీవ్రంగా నష్టపోతున్న రైతుల సమస్యలను తెలుసుకునేందుకు, గిరిజన శాఖ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు, జిల్లా కలెక్టర్ గారు చినలబుడు పంచాయతీలోని పకనకుడి గ్రామానికి విచ్చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అరకు పార్లమెంట్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మొస్య ప్రేమ్ కుమార్, స్వామి జగన్ గారు కాఫీ రైతుల తరపున సమస్యలను వివరించారు. ప్రధానంగా వారు వినిపించిన సమస్యలు: 5వ షెడ్యూల్ ఆదివాసీ ప్రాంతానికి సంబంధించిన చట్టాన్ని ఉల్లంఘిస్తూ, ఇతర వ్యక్తులు, మల్టీనేషనల్ కంపెనీలు, దళారీలు, సంస్థలు ఆదివాసీ భూములు, ఆస్తులు, వ్యాపారాల్లో జోక్యం చేసుకుంటున్నారని తెలిపారు. సమతా జడ్జిమెంట్ ద్వారా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పట్టించుకోకుండా ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్లే వైరస్ వంటి సమస్యలు పెరిగినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీల ఆర్థిక అభివృద్ధికి ప్రపంచ గుర్తింపు పొందిన అరకు కాఫీ పంటను ఉపయోగించి, మండల కేంద్రాల్లో కాఫీ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. కాఫీ మార్కెటింగ్‌లో ఆదివాసీలకు ప్రాధాన్యత ఇచ్చేందుకు జిసిసి, ఐటిడిఏ ద్వారా స్థానిక యువతకు అనుమతులు ఇచ్చి, కాఫీ హౌసులు, కాఫీ మ్యూజియంలు, కాఫీ షాపులు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. వైరస్ కారణంగా నష్టపోతున్న రైతులకు ప్రభుత్వం ప్రకటించిన కేజీకి రూ.50 నష్టపరిహారం సరిపోదని, దీనిని పెంచి తగిన నష్టపరిహారం చెల్లించాలని కోరారు. అనధికారికంగా కాఫీ కొనుగోలు చేస్తున్న దళారీలు, సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, జీఎస్టీ లేకుండా, లైసెన్సులు లేకుండా, అనుమతులు లేకుండా కాఫీని కొనుగోలు చేస్తున్న వారిని గుర్తించి శిక్షించాలన్నారు. వైరస్ నివారణ చర్యలను వేగవంతం చేసి, దీనికి కారణమైన కుట్రలను వెలుగులోకి తెచ్చి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి, కాఫీ రైతులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున నాయకులు, అధికారులు, స్థానిక కాఫీ రైతులు, గ్రామస్తులు హాజరయ్యారు.

