ఖమ్మం అక్టోబర్ (పున్నమి ప్రతి నిధి) ఖమ్మం పట్టణం అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి గురుస్వామి తాండ్రా ప్రసాద్ గురు స్వామి ఆధ్వర్యంలో పాత వెంకటేశ్వర సినిమా హాల్ సెంటర్ నందు నిర్వహిస్తున్న అయ్యప్ప స్వాముల అన్నప్రసాద వితరణ ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం జరిగింది. ముఖ్యఅతిథిలుగా తెలంగాణ ప్రాంత సామాజిక సమరత కన్వీనర్ అప్పలప్రసాద్ Bjp ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు రావు లు హాజరై ఈ కార్యక్రమం ని ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమం లో బీజేపీ నాయకులు ధనియాకుల వెంకట్ నారాయణ. టి రవీందర్, యుగంధర్ నాయుడు, నరేష్, రామకృష్ణ, సురేష్, రాజేష్, లతో పాటు పలువురు బీజేపీ నాయుకులు అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. మకర సంక్రాతి వరకు ఇక్కడ అయ్యప్ప భక్తులకి అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అని నిర్వహుకులు తెలియజేసారు..


