పువ్వాడ నాగేంద్ర కుమార్
(పున్నమి తెలంగాణ ప్రతి నిధి)
ఖమ్మం 1వ పట్టణం 18వ డివిజన్‌లో శ్రీ దివ్య మణికంఠ అన్నదాన సేవ సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అయ్యప్ప మండపాన్ని ఈరోజు బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు శ్రీ నెల్లూరి కోటేశ్వరరావు, ఖమ్మం 1 వ పట్టణ అధ్యక్షులు గడీల నరేష్ సందర్శించారు. పూజ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం జరిగిన మహా అన్నసంతర్పణలో అయ్యప్ప మాలధారణ చేసిన భక్తులతో కలిసి సహాపంక్తి భోజనం చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా కార్తీకమాసం సందర్భంగా ప్రతిరోజు సుమారు 1500 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న ట్రస్ట్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. వృత్తిరీత్యా వివిధ ప్రాంతాల్లో పనిచేసే అయ్యప్ప మాలదారుల కోసం ఒకే వేదికపై అన్నసేవ అందిస్తుండడం ప్రశంసనీయమన్నారు.
కమిటీ సభ్యులు శ్రీరాముల వీరభద్రం, ఉప్పల భూపతి రెడ్డి, శ్రీనివాస్‌తో పాటు బీజేపీ నాయకులు నెల్లూరి బెనర్జీ, బండ్ల రిగాన్ ప్రతాప్, పొట్టిమూతి జనార్దన్, గడల నరసింహారావు, నేరెళ్ల శ్రీనివాస్, పాలేపు రాము, మేడ సంపత్ తదితరులు పాల్గొన్నారు.


