*అయ్యప్ప దీక్ష లో తల్లెం భరత్ కుమార్ రెడ్డి*
*మొదటి కార్తీక సోమవారం సందర్భంగా అయ్యప్ప మాల ధరించిన తల్లెం
*రైల్వే కోడూరు అయ్యప్ప స్వామి గుడిలో పురోహితులు సుదర్శన శర్మ చేతుల మీదుగా మాలధారణ*
రైల్వే కోడూరు/
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో పురోహితులు బండాత్మకూరు సుదర్శన్ శర్మ చేతులు మీదుగా అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులతో దీవెనలతో మొదటి కార్తీక సోమవారం సందర్భంగా గుంతకల్ రైల్వే డివిజన్ వినియోగదారుల సభ్యులు, వైసిపి రాయలసీమ బూత్ కమిటీ కన్వీనర్ తల్లెం భరత్ కుమార్ రెడ్డి అయ్యప్ప స్వామి వారి దీక్ష స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవడం జన్మజన్మల పుణ్యంగా భావిస్తూ ఈ మాల ధారణలో నియమ నిష్ఠలతో అయ్యప్ప స్వామివారిని ధ్యానించుకుంటూ అయ్యప్ప నామస్మరణలతో భక్తి పారవశ్యంతో ప్రతి ఒక్కరు అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆయన అన్నారు


