*జంబ లకిడి పంబ….పంబ లకిడి జంబ…..గొంతు మార్చి….అబ్బాయి కాస్త అమ్మాయి వాయిస్ తో ఒక వృద్ధుడి నుంచి రూ. కోటి దోపిడీ*
బాబోయ్ పోయాం మోసం …అంటూ పోలీసు కి పిర్యాదు చేసిన బాధితుడు….ఎట్టకేలకు నిందితుడు చైతన్యకృష్ణపవన్‌ను అరెస్టు చేసిన పోలీసులు
శైలజ, సుజాత, సునీత, నీలిమ ఇవన్నీ ఒకరి పేర్లే. అతడే ఆమెగా పేర్లు మార్చుకుని షోషల్ మీడియా లో… పురుషులను ఆకర్షించి డబ్బులు దొబ్బుతున్న వ్యక్తిని గుంటూరు జిల్లాలోని పట్టాభిపురం పోలీసులు అరెస్టు చేశారు.
ఈ కేసుకు సంబంధించి మంగళవారం ఎస్పీ వకుల్ జిందాల్ వివరాలను వెల్లడించారు
బాపట్ల జిల్లా ఇంకొల్లుకు చెందిన చోడ చైతన్యకృష్ణపవన్ ఇంజినీరింగ్ చేసి హోటల్‌లో చెఫ్‌గా పని చేసేవాడు. ఆన్‌లైన్ జూదానికి అలవాటు పడిన అతను డబ్బుల కోసం సైబర్ నేరాలకు పాల్పడ్డాడు. ఫేస్‌బుక్‌లో అమ్మాయిల పేర్లతో నకిలీ ఖాతాలను తెరిచి పురుషులకు ఫ్రెండ్ రిక్వెస్టులు పంపి, వారితో అమ్మాయిలా చాటింగ్‌లు చేసేవాడు. అంతేకాకుండా కాల్‌బాయ్‌లా పని చేస్తే డబ్బులు ఇస్తామని మెసేజ్‌లను పంపి వారిని ముగ్గులోకి దింపి రిజిస్ట్రేషన్ పేరుతో దాదాపు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు నగదును తన ఖాతాల్లో వేయించుకునేవాడు.
వృద్ధుడి వద్ద రూ.కోటి దోచేశాడు: గుంటూరు ఎస్‌వీఎన్‌కాలనీకి చెందిన 68 ఏళ్ల వృద్ధుడితో శైలజ పేరుతో చాటింగ్ చేశాడు. కాల్‌బాయ్‌గా వెళ్తే డబ్బులొస్తాయని చెప్పాడు. ఇలాంటివి ఇష్టం లేదని ఆయన చెప్పినా వినకుండా పది రోజుల పాటు విసిగించాడు. తర్వాత వేరే నంబరు నుంచి ఫోన్ చేసి తాను పోలీసునని మహిళతో అసభ్యకరంగా చాటింగ్ చేస్తున్నట్టు నీ మీద కేసు నమోదైందని భయభ్రాంతులకు గురి చేశాడు. నిన్ను ఈ కేసు నుంచి తప్పించడానికి నాకు కావాల్సిన డబ్బులివ్వాలని బెదిరించాడు. అనంతరం మరుసటి రోజు వేరే నంబరు నుంచి ఫోన్ చేసి ఐటీ అధికారినని రైసుమిల్లులో సోదాలకు వస్తున్నానని చెప్పాడు. అలా పలు రకాలుగా వేధించి విడతలవారీగా రూ.కోటి వరకు అతని ఖాతాలోకి జమ చేయించుకున్నాడు.
అరెస్టు చేసిన పోలీసులు: అనంతం మోసపోయానని ఆలస్యంగా గ్రహించిన వృద్ధుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం ఎస్పీ వకుల్‌జిందాల్ పర్యవేక్షణలో ఐసీకోర్ సీఐ నిస్సార్‌బాషా, ఎస్సైలు రాజ్‌కుమార్, ప్రదీప్, సిబ్బంది తదితరులు కేసుపై దర్యాప్తు చేసి, నిందితుడు చైతన్యకృష్ణపవన్‌ను అరెస్టు చేశారు. ఇతను గతంలో సైతం పలువురి నుంచి రూ. 24 లక్షల వరకు డబ్బులను కాజేశాడు
నిందితుడు కాల్‌బాయ్‌గా పని చేయడానికి అంగీకరించిన వారిని పోలీసునని చెప్పి బెదిరించేవాడు. దాదాపు పదికి పైగా చరవాణి నంబర్లు ఉపయోగించి, గొంతు మార్చి కానిస్టేబుల్ సుబ్బు, కోర్టు కానిస్టేబుల్ తేజ, సైబరాబాద్ ఎస్సై శ్రీనివాస్, అనంతపురం సీఐ ప్రభాకర్‌రెడ్డి, హైకోర్టు న్యాయవాది సత్యనారాయణ అని మాట్లాడి అందరినీ బురిడీ కొట్టించేవాడు. ఈ కేసు నుంచి తప్పించటానికి డబ్బులివ్వాలని బెదిరించి తన ఖాతాలో జమ చేయించుకునేవాడు


