అమీర్పేట్ 107 సర్వేనెంబర్ పై కలెక్టర్ నజర్
వడ్డే మోని దాసు అభ్యర్థనకు పాజిటివ్ స్పందన
తక్షణ చర్యలకు ఆర్డీవోకు మరియు జిల్లా సర్వే డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ కు ఆదేశం
పున్నమి న్యూస్ ప్రతినిధి
రంగారెడ్డి జిల్లా, మార్చి 10::
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలో ఉన్న అమీర్పేట గ్రామంలో గల సర్వేనెంబర్ 107
పై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రత్యేక దృష్టిని సారించారు. ఈ విషయంలో బాధితుడు మాణిక్యమ్మ గూడెంకు చెందిన వడ్డేమోని దాసుకు న్యాయం చేయమని కందుకూర్ ఆర్డీవో ను ఆదేశించడం జరిగింది. మంగళవారం ఈనెల కొట్టు మహేశ్వరం మండల రెవెన్యూ ఆఫీసర్ కార్యాలయంలో కలెక్టర్ నారాయణ రెడ్డి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అమీర్పేట సర్వే నెంబర్ 107 కు సంబంధించి ఆరా తీశారు. తక్షణ చర్యలకు సంబంధించి ఆర్డీవోను ఆదేశించడం జరిగింది.రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం 107 సర్వేనెంబర్ లో తన భూమిలోకి ఇతరులు తాను దళితుడిని అనే నిర్లక్ష్యంతో దౌర్జన్యంగా ప్రవేశించి పోలీసుల సహకారంతో అక్కడ రిసార్టుకు రోడ్డు వేశారని దాసు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే మహేశ్వరం మండల సర్వేయర్ 107 సర్వేనెంబర్ కు హద్దులు కూడా నిర్ణయించారని, అయితే వాటిని తొలగించి మరి తన భూమిలో రోడ్డు వేశారని కూడా ఆయన కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీంతో సానుకూలంగా స్పందించిన కలెక్టర్ నారాయణరెడ్డి తక్షణమే తగిన చర్యలు తీసుకొని దళితుడు అయిన బాధితుడికి న్యాయం చేయాలని చేయాలని కందుకూరు ఆర్డీవోను ఆదేశించడం జరిగింది.
అదేవిధంగా కోర్టు ఉత్తర్వులు మేరకు నడుచుకోవాలని వాటికి హద్దులు కూడా నిర్ణయించాలని కూడా ఆర్డిఓ దృష్టికి చేస్తూ, ఈ సందర్భంగా పూర్తి న్యాయం చేయడంలో కందుకూరు ఆర్డీవో మరియు రంగారెడ్డి జిల్లా సర్వే ఆఫీసర్ తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి సందర్భంగా ఆదేశించారు. తో వడ్డే మోని దాసు ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. దళితుల చట్టాలు అమలులో ఉన్నప్పటికీ తనకు తన కుటుంబానికి బంధువులకు జరుగుతున్న అన్యాయాలపై దళితుల చట్టాల ఉల్లంఘన పై కలెక్టర్కు వివరించడం జరిగింది. దీంతో ఎలాంటి అన్యాయం జరగనివ్వబోనని చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హామీ ఇచ్చారు. అనంతరం అమీర్పేట గ్రామంలోని సర్వే నెంబర్ 107 లో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే కందుకూర్ నుంచి వచ్చి హద్దులు నిర్ణయించడం జరిగింది.
Uploaded Video:



