అమలాపురం, అక్టోబరు 22 (పున్నమి ప్రతినిధి) :
అమలాపురం పట్టణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బోనం వర ప్రసాద్ ఆద్వర్యంలో అమలాపురం కోకస్ లాడ్జి లో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బోనం వర ప్రసాద్ మాట్లాడుతూ ఇటీవల ఒక యువకుడు బిర్యానీ తిని మృతి చెందాడని ఒక అవాస్తవమైన వార్త సోషల్ మీడియాలోని వైరల్ అయిందని, బిర్యానీలో వచ్చింది మండ్రకప్ప , తేలు, వంటివి కాదని వీడియో కూడా నిజమైనది అని ఎవరు ధ్రువీకరించలేదని, అవాస్తవం అని ఆయన అన్నారు. అతను బిర్యానీ తిని మృతి చెందలేదని, బ్లెడ్ క్లాట్ అవడం వలన హార్ట్ స్ట్రోక్ తో మృతి చెందడం జరిగిందని మృతుడి తండ్రి , బంధువులు కూడా తెలిపారని, అలాగే వైద్యులు కూడా గత మూడు నెలలుగా అతని ప్రైవేట్ హాస్పటల్ లో వైద్యం చేయించుకుంటున్నాడని,అతను అనారోగ్య సమస్యలతో హార్ట్ స్ట్రోక్ తో మృతి చెందాడని, ధ్రువీకరించారు అన్నారు, సోషల్ మీడియాలో ఏదైనా వార్త వస్తే అది నిజమా, కాదా అని నిర్ధారించుకుని షేర్ చేయాలని అన్నారు. ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులను కూడా ఎటువంటి కంప్లైంట్లు రాలేదని దృవీకరించారు, ఈ ఘటనపై హోటల్ ప్రతినిధులు మాట్లాడుతూ అవాస్తవాలు షేర్ చేయడం వలన హోటల్ వ్యాపారులు తీవ్రంగా నష్ట పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడి తండ్రి గంగాధర్ తన కుమారుడు అనారోగ్యం కారణం వల్లనే చనిపోయాడని, తల్లిదండ్రులు చెప్తుంది నికరమని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని, తన కుమారుని మృతిని వ్యక్తిగత కారణాలతో ప్రచారం చేయవద్దని, ఇలాంటి వార్తలని వైరల్ చేయటం సరికాదన్నారు. దీనిని ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపున వ్యాపారస్తులు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షులు
కొమ్మూరి వెంకటాచలప్రసాద్, చాంబర్ సలహాదారులు నల్లా పవన్ కుమార్, హోటల్స్ అసోసియేషన్ సెక్రటరీ కోకా రాంబాబు, మాజీ మున్సిపల్ ఛైర్మన్ నల్లా విష్ణు మూర్తి (విష్ణు శ్రీ రెస్టారెంట్), గారపాటి వంశీ,(జీకే రెస్టారెంట్ ) బాలూ (గణపతి రెస్టారెంట్ ), సురేష్ నాయుడు (హ్యాపీ రెస్టారెంట్), D.నాయుడు (గ్రీన్ పార్క్) చిక్కం గణేష్ (బొండం బాబాయ్ హోటల్ ), హరిబాబు (తారా రెస్టారెంట్) మరియు వ్యాపార ప్రముఖులు పాల్గొన్నారు.

అమలాపురం హోటల్స్ పై దుష్ప్రచారాన్ని ఖండించిన చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు : బోనం
అమలాపురం, అక్టోబరు 22 (పున్నమి ప్రతినిధి) : అమలాపురం పట్టణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బోనం వర ప్రసాద్ ఆద్వర్యంలో అమలాపురం కోకస్ లాడ్జి లో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బోనం వర ప్రసాద్ మాట్లాడుతూ ఇటీవల ఒక యువకుడు బిర్యానీ తిని మృతి చెందాడని ఒక అవాస్తవమైన వార్త సోషల్ మీడియాలోని వైరల్ అయిందని, బిర్యానీలో వచ్చింది మండ్రకప్ప , తేలు, వంటివి కాదని వీడియో కూడా నిజమైనది అని ఎవరు ధ్రువీకరించలేదని, అవాస్తవం అని ఆయన అన్నారు. అతను బిర్యానీ తిని మృతి చెందలేదని, బ్లెడ్ క్లాట్ అవడం వలన హార్ట్ స్ట్రోక్ తో మృతి చెందడం జరిగిందని మృతుడి తండ్రి , బంధువులు కూడా తెలిపారని, అలాగే వైద్యులు కూడా గత మూడు నెలలుగా అతని ప్రైవేట్ హాస్పటల్ లో వైద్యం చేయించుకుంటున్నాడని,అతను అనారోగ్య సమస్యలతో హార్ట్ స్ట్రోక్ తో మృతి చెందాడని, ధ్రువీకరించారు అన్నారు, సోషల్ మీడియాలో ఏదైనా వార్త వస్తే అది నిజమా, కాదా అని నిర్ధారించుకుని షేర్ చేయాలని అన్నారు. ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులను కూడా ఎటువంటి కంప్లైంట్లు రాలేదని దృవీకరించారు, ఈ ఘటనపై హోటల్ ప్రతినిధులు మాట్లాడుతూ అవాస్తవాలు షేర్ చేయడం వలన హోటల్ వ్యాపారులు తీవ్రంగా నష్ట పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడి తండ్రి గంగాధర్ తన కుమారుడు అనారోగ్యం కారణం వల్లనే చనిపోయాడని, తల్లిదండ్రులు చెప్తుంది నికరమని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని, తన కుమారుని మృతిని వ్యక్తిగత కారణాలతో ప్రచారం చేయవద్దని, ఇలాంటి వార్తలని వైరల్ చేయటం సరికాదన్నారు. దీనిని ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపున వ్యాపారస్తులు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షులు కొమ్మూరి వెంకటాచలప్రసాద్, చాంబర్ సలహాదారులు నల్లా పవన్ కుమార్, హోటల్స్ అసోసియేషన్ సెక్రటరీ కోకా రాంబాబు, మాజీ మున్సిపల్ ఛైర్మన్ నల్లా విష్ణు మూర్తి (విష్ణు శ్రీ రెస్టారెంట్), గారపాటి వంశీ,(జీకే రెస్టారెంట్ ) బాలూ (గణపతి రెస్టారెంట్ ), సురేష్ నాయుడు (హ్యాపీ రెస్టారెంట్), D.నాయుడు (గ్రీన్ పార్క్) చిక్కం గణేష్ (బొండం బాబాయ్ హోటల్ ), హరిబాబు (తారా రెస్టారెంట్) మరియు వ్యాపార ప్రముఖులు పాల్గొన్నారు.

