Monday, 8 December 2025
  • Home  
  • అమరులైన పోలీస్ వారికి ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే కాకర్ల
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అమరులైన పోలీస్ వారికి ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే కాకర్ల

ఉదయగిరి మండల కేంద్రంలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి కార్యాలయ ప్రాంగణంలో జాతీయ పోలీస్ సంస్మరణ వారోత్సవాలు మరియు జాతీయ ఐక్యత – 2025 దినోత్సవం ఘనంగా నిర్వహించబడినవి. ఈ సందర్భంగా ఉదయగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎన్. వెంకట్రావు గారి ఆధ్వర్యంలో, నోవా బ్లడ్ సెంటర్ వారి సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు హాజరై రిబ్బన్ కటింగ్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ — స్వాతంత్రం వచ్చినప్పటి నుండి విధి నిర్వహణలో ఇప్పటి వరకు 36వేల మంది పోలీస్ సిబ్బంది ప్రాణాలను అర్పించగా వారి త్యాగాలను గౌరవించుకుంటూ మాన్యశ్రీ గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు వారి పేర్లతో కూడిన నేషనల్ పోలీస్ మెమోరియల్ ను న్యూఢిల్లీలో ఏర్పాటు చేసి, జాతికి అంకితం చేశారని, ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ఆంధ్రప్రదేశ్ పోలీస్ వారి త్యాగనిరతిని ప్రశంసిస్తూ, అమరు అమరులైన పోలీస్ వీరులను స్మరిస్తూ వారి కుటుంబాలను పరామర్శించి ఓదార్పునిచ్చారని తెలిపారు. వారి బాటలోనే మేము కూడా అమరులైన పోలీస్ కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. దేశ భద్రత కోసం ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్న పోలీసు సిబ్బంది త్యాగాలు అపూర్వమైనవి, అమరులైన వారి త్యాగాలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయని పేర్కొన్నారు. పోలీసులు సమాజానికి రక్షణ కవచంలా ఉంటారని, వారి సేవలు ప్రతి పౌరుడికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. ప్రతి ఒక్కరూ పోలీసు వ్యవస్థ పట్ల గౌరవభావం కలిగి ఉండి, సమాజ అభివృద్ధిలో భాగస్వాములుగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమము ముందుగా ఉదయగిరి సర్కిల్ పరిధిలోని ఎనిమిది మండలాల పోలీసు సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు కలిసి ర్యాలీగా బయలుదేరి “పోలీస్ అమరవీరులకు జోహార్” అంటూ నినాదాలు చేశారు. ఈ ర్యాలీ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయానికి చేరుకొని అక్కడ స్మారకార్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది పోలీసులు, స్థానిక ప్రజాప్రతినిధులు, యువత, నోవా బ్లడ్ సెంటర్ వాలంటీర్లు పాల్గొన్నారు. రక్తదాన శిబిరంలో అనేకమంది స్వచ్ఛందంగా రక్తదానం చేసి, సామాజిక బాధ్యతను చాటుకున్నారు.

ఉదయగిరి మండల కేంద్రంలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి కార్యాలయ ప్రాంగణంలో జాతీయ పోలీస్ సంస్మరణ వారోత్సవాలు మరియు జాతీయ ఐక్యత – 2025 దినోత్సవం ఘనంగా నిర్వహించబడినవి. ఈ సందర్భంగా ఉదయగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎన్. వెంకట్రావు గారి ఆధ్వర్యంలో, నోవా బ్లడ్ సెంటర్ వారి సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు హాజరై రిబ్బన్ కటింగ్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ —
స్వాతంత్రం వచ్చినప్పటి నుండి విధి నిర్వహణలో ఇప్పటి వరకు 36వేల మంది పోలీస్ సిబ్బంది ప్రాణాలను అర్పించగా వారి త్యాగాలను గౌరవించుకుంటూ మాన్యశ్రీ గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు వారి పేర్లతో కూడిన నేషనల్ పోలీస్ మెమోరియల్ ను న్యూఢిల్లీలో ఏర్పాటు చేసి, జాతికి అంకితం చేశారని, ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ఆంధ్రప్రదేశ్ పోలీస్ వారి త్యాగనిరతిని ప్రశంసిస్తూ, అమరు అమరులైన పోలీస్ వీరులను స్మరిస్తూ వారి కుటుంబాలను పరామర్శించి ఓదార్పునిచ్చారని తెలిపారు. వారి బాటలోనే మేము కూడా అమరులైన పోలీస్ కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. దేశ భద్రత కోసం ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్న పోలీసు సిబ్బంది త్యాగాలు అపూర్వమైనవి, అమరులైన వారి త్యాగాలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయని పేర్కొన్నారు. పోలీసులు సమాజానికి రక్షణ కవచంలా ఉంటారని, వారి సేవలు ప్రతి పౌరుడికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. ప్రతి ఒక్కరూ పోలీసు వ్యవస్థ పట్ల గౌరవభావం కలిగి ఉండి, సమాజ అభివృద్ధిలో భాగస్వాములుగా మారాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమము ముందుగా ఉదయగిరి సర్కిల్ పరిధిలోని ఎనిమిది మండలాల పోలీసు సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు కలిసి ర్యాలీగా బయలుదేరి “పోలీస్ అమరవీరులకు జోహార్” అంటూ నినాదాలు చేశారు. ఈ ర్యాలీ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయానికి చేరుకొని అక్కడ స్మారకార్చన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో అనేక మంది పోలీసులు, స్థానిక ప్రజాప్రతినిధులు, యువత, నోవా బ్లడ్ సెంటర్ వాలంటీర్లు పాల్గొన్నారు. రక్తదాన శిబిరంలో అనేకమంది స్వచ్ఛందంగా రక్తదానం చేసి, సామాజిక బాధ్యతను చాటుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.