ಸಂಪರ್ಕಿಸಿ ಇತ್ತೀಚಿನ ಸುದ್ದಿ
ನಿಜವಾದ ಸುದ್ದಿ. ವೇಗವಾದ ಮಾಹಿತಿ. ಆಂಧ್ರ ಪ್ರದೇಶ • ತೆಲಂಗಾಣ • ರಾಷ್ಟ್ರೀಯ
ಲೇಖಕರ ಪ್ಯಾನೆಲ್
ವಿಶಾಖಪಟ್ಟಣಂ

అమరావతి యోగా ఛాంపియన్ షిప్ లో సత్తా చాటిన సావన్ మిత్ర స్కూల్ విద్యార్థి

ಪುನ್ನಮಿ ನ್ಯೂಸ್‌ರೂಮ್ ಪ್ರಕಟಿತ:
అమరావతి యోగా ఛాంపియన్ షిప్ లో సత్తా చాటిన సావన్ మిత్ర స్కూల్ విద్యార్థి

అనకాపల్లి జిల్లా తరఫున ఎంపికై.. రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత

కఠోర సాధన, క్రమశిక్షణతో పి. హర్షవర్ధన్‌ ఘనత
*************************
విశాఖపట్నం జిల్లా, ఆనందపురం మండలం (పున్నమి ప్రతినిధి): ఆగస్టు 11::
సావన్ మిత్ర స్కూల్ విద్యార్థి పి. హర్షవర్ధన్ యోగా విభాగంలో ప్రతిభ చాటుతూ అరుదైన ఘనత సాధించాడు. ఆనందపురం మండలంలోని, గిడిజాల గ్రామంలో గల, సావన్ మిత్ర స్కూల్లో విద్యాభ్యాసం చేస్తున్న హర్షవర్ధన్‌ అమరావతి చాంపియన్‌షిప్ (యోగా) పోటీల్లో అనకాపల్లి జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు ఎంపికయ్యాడు.

⭐ రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత
జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన హర్షవర్ధన్‌ తదుపరి రాష్ట్రస్థాయి యోగా పోటీలకు అర్హత సాధించడం పట్ల పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
హర్షవర్ధన్‌ సాధించిన ఈ విజయానికి అతని క్రమశిక్షణ, నిరంతర సాధన, అంకితభావమే ప్రధాన కారణమని పాఠశాల యాజమాన్యం పేర్కొంది. విద్యతో పాటు క్రీడలు, యోగా వంటి అంశాల్లోనూ విద్యార్థులను ప్రోత్సహిస్తూ సమగ్ర అభివృద్ధికి సావన్ మిత్ర స్కూల్ కృషి చేస్తోందని తెలిపింది.
🏆 పాఠశాలకు గర్వకారణం
ఒక విద్యార్థి జిల్లా స్థాయి నుంచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం పాఠశాలకు గర్వకారణమని, సావన్ మిత్ర స్కూల్,చైర్మన్ రొంగలి వెంకటేశ్వరరావు గారు ( వెంకట్),ప్రిన్సిపాల్
ఆర్ ఎస్ ఎన్ కృష్ణంరాజు,కరెస్పాండంట్ ఆర్ పద్మ, డైరెక్టర్ ఆర్.సత్య వేణి హర్షం వ్యక్తం చేశారు, హర్షవర్ధన్‌ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని పాఠశాల సిబ్బంది ఆకాంక్షించారు.
“ఈ విజయం ఆరంభం మాత్రమే.. రాష్ట్రస్థాయిలోనూ అద్భుత ప్రతిభ కనబరిచి పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి” అంటూ హర్షవర్ధన్‌కు ఉపాధ్యాయులు, సహచర విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు.
పున్నమి న్యూస్ హైలెట్
జిల్లా స్థాయి నుంచి రాష్ట్రస్థాయికి..
యోగా వేదికపై హర్షవర్ధన్‌ ప్రతిభ!
సావన్ మిత్ర స్కూల్‌కు మరో గర్వకారణం! 🌟🏆

అమరావతి యోగా ఛాంపియన్ షిప్ లో సత్తా చాటిన సావన్ మిత్ర స్కూల్ విద్యార్థి

అమరావతి యోగా ఛాంపియన్ షిప్ లో సత్తా చాటిన సావన్ మిత్ర స్కూల్ విద్యార్థి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *