పున్నమి ప్రతినిధి
రాజధాని అమరావతి వేగంగా ఆర్థిక కేంద్రంగా మారుతోంది. ఇక్కడ 15 బ్యాంకులు, బీమా సంస్థలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఇందుకోసం మొత్తం రూ.1,328 కోట్లు పెట్టుబడిగా పెట్టనుండగా, దాదాపు 6,541 ఉద్యోగాలు లభించనున్నాయి. ఇందులో SBI, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా, యూనియన్ బ్యాంక్, బరోడా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, LIC, న్యూ ఇండియా అస్యూరెన్స్ వంటి ప్రధాన సంస్థలు ఉన్నాయి. ఈ అభివృద్ధి వల్ల అమరావతిలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరగనున్నాయి.


