Sunday, 29 March 2026
  • Home  
  • అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం: డాక్టర్ రవి కృష్ణ*
- Blog

అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం: డాక్టర్ రవి కృష్ణ*

ఆంధ్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని కళారాధన కార్యాలయంలో నంద్యాల లయన్స్ క్లబ్, కళారాధన, నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కళారాధన ప్రధాన కార్యదర్శి, దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ 1956లో పొట్టి శ్రీరాములు 58 రోజులు నిరాహార దీక్ష చేసి అమరులైన తరువాత దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని గుర్తు చేశారు. తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని, దేశంలో ప్రత్యేక గుర్తింపు ఉండాలని పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయం, భావితరాలకు స్ఫూర్తిదాయకం అన్నారు అమరావతిలో కూటమి ప్రభుత్వం పొట్టి శ్రీరాములు భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, కార్యదర్శి తాతిరెడ్డి భాస్కర రెడ్డి, కోశాధికారి అమిదేల జనార్ధన్, నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎం.పీ. వి. రమణయ్య, కళారాధన కార్యవర్గ సభ్యుడు శివరామిరెడ్డి,నాగలింగేశ్వర రెడ్డి,లయన్స్ క్లబ్ సభ్యులు వాసు, కార్యాలయ కార్యదర్శి మధు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.