ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు కు ఘన నివాళులు అర్పించారు. నవంబర్ 1న నందిగామ మండలం మాగల్లు గ్రామంలో కొమ్మినేని రవిశంకర్ నివాసంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, నందిగామ నియోజక వర్గ ఇన్చార్జి మొండితోక జగన్మోహనరావు, జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ — “తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు త్యాగమే మూలం. ఆయన ఆత్మబలిదానంతోనే భాషాపరమైన రాష్ట్రాల ఏర్పాటుకు మార్గం సుగమ మైంది. దేశంలో భాషా ఆధారం గా ఏర్పడిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం ఆయన త్యాగానికి నిలువెత్తు నిదర్శనం” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, పెద్దలు మరియు ప్రజాప్రతినిధు లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అమరజీవి పొట్టి శ్రీరాములుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నివాళి
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు కు ఘన నివాళులు అర్పించారు. నవంబర్ 1న నందిగామ మండలం మాగల్లు గ్రామంలో కొమ్మినేని రవిశంకర్ నివాసంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, నందిగామ నియోజక వర్గ ఇన్చార్జి మొండితోక జగన్మోహనరావు, జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ — “తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు త్యాగమే మూలం. ఆయన ఆత్మబలిదానంతోనే భాషాపరమైన రాష్ట్రాల ఏర్పాటుకు మార్గం సుగమ మైంది. దేశంలో భాషా ఆధారం గా ఏర్పడిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం ఆయన త్యాగానికి నిలువెత్తు నిదర్శనం” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, పెద్దలు మరియు ప్రజాప్రతినిధు లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

