రౌతులపూడి, (పున్నమి ప్రతినిధి )డిసెంబర్ 11:
మండలంలోని మల్లంపేట గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు శ్రీరంరెడ్డి శ్రీనివాస్ 50 వ పుట్టినరోజు వేడుకను ఆయన అభిమానుల సమక్షంలో కన్నుల పండుగ నిర్వహించారు. ముందుగా తమ అభిమాన నాయకుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు అనంతరం అభిమానుల మధ్యలో భారీ కటింగ్ నిర్వహించారు. మండల నలుమూలల గ్రామాల నుండి అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు విచ్చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ తన అభిమానులు తనపై చూపించిన ప్రేమ మరువలేనిదని శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో రౌతులపూడి మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు తామరలా సత్యనారాయణ, మండల యువ నాయకులు పైల వేణుగోపాల్, ఇట్టంశెట్టి అశోక్, మల్లంపేట ఉప సర్పంచ్ రాయపురెడ్డి కన్నబాబు, ఎస్ ఆర్ కె నాయుడు, మల్లవరం తెలుగు దేశం నాయకుడు గావిరెడ్డి గురునాధ్, శెట్టి సత్తిబాబు, మరియు రౌతులపూడి మండల తెలుగుదేశం నాయకులు పాల్గున్నారు.


