నెల్లూరు హరనాథపురం ప్రాంతంలో ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ నివాసానికి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెళ్లి పరామర్శించారు. ఇటీవల అజీజ్ గారి మాతృమూర్తి మరణం నేపథ్యంలో ఆయనను కలిసి సానుభూతి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా అజీజ్ మాతృమూర్తి చిత్రపటం వద్ద పూలమాల వేసి నివాళులర్పించిన అనిల్ కుమార్ యాదవ్, అనంతరం అబ్దుల్ అజీజ్తో మాట్లాడి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని ఆయనకు ఆత్మీయంగా ఓదార్పు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి, ఖలీల్ అహ్మద్ తదితరులు పాల్గొని అజీజ్ కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేశారు.
పలువురు నాయకులు, కార్యకర్తలు కూడా అజీజ్ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.



