పున్నమి: అబ్దుల్లాపూర్ మెంట్ మండలం రంగారెడ్డి జిల్లా: ఓ వ్యక్తి ఆర్థిక సమస్యలతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఒరిస్సా రాష్ట్రం, బాలేశ్వర్ జిల్లా, భీంపూర్ గ్రామానికి చెందిన సుబ్రత్ జైన్ (46) రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండలం, కవాడిపల్లి గ్రామంలో ఆయన భార్య ఇద్దరు కుమారులతో కలిసి ఒక గదిలో నివాసం ఉంటున్నారు. కాగా వారు అదే గ్రామంలోని జిఎస్పి ఇండస్ట్రీస్ లో పని చేస్తున్నారు. అతని పెద్ద కుమారుడు సుకమోల్ జైన్ (20) ఆదివారం ఉదయం బయటకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. ఉదయం 9.30 గంటల సమయంలో అదే కంపెనీలో పనిచేస్తున్న బిస్తు, సుకమోల్ సహోద్యోగి సుబ్రత్ జైన్ ఇంటికి వచ్చి సుకమోల్ లుంగీతో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడాడని చెప్పాడు. దీంతో అతని తండ్రి వెంటనే హుటాహుటిన అక్కడికి చేరుకొని చూడగా, తన కుమారుడు ఆర్థిక సమస్యల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించాడు. సుకమోల్ మరణం పై తమకు ఎలాంటి అనుమానం లేదని పేర్కొన్నారు.

అబ్దుల్లాపూర్ మెంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్థిక సమస్యలతో ఉరి వేసుకొని వ్యక్తి మృతి