Sunday, 15 February 2026
  • Home  
  • అప్పు కోసం వెలిసిన క్షేత్ర మహిమ…చరిత్ర–పురాణ వైభవంతో వెలుగొందుతున్న అప్పికొండ సోమేశ్వరాలయం
- విశాఖపట్నం

అప్పు కోసం వెలిసిన క్షేత్ర మహిమ…చరిత్ర–పురాణ వైభవంతో వెలుగొందుతున్న అప్పికొండ సోమేశ్వరాలయం

విశాఖ…గాజువాక (పున్నమి ప్రతినిధి): బంగాళాఖాత తీరాన సముద్ర అలల మృదుస్వరాల మధ్య ఆధ్యాత్మిక కాంతిని విరజిమ్ముతున్న అప్పికొండ సోమేశ్వరాలయం సుమారు 1400ఏళ్ల చరిత్రను తనలో దాచుకున్న ప్రాచీన శైవక్షేత్రంగా విశేష ఖ్యాతి గడించింది.ప్రకృతి ఒడిలో,కొండచరియల నడుమ,సముద్రానికి అతి సమీపంలో వెలసిన ఈ దేవాలయం చారిత్రక ప్రాముఖ్యతతో పాటు పురాణగాథలతో భక్తులను ఆకర్షిస్తోంది.చాళుక్యుల కాలానికి చెందిన నిర్మాణశైలి ఈ ఆలయంలో స్పష్టంగా కనిపిస్తుంది.శిలా స్తంభాలపై చెక్కిన నాజూకైన శిల్పాలు,గర్భగుడి నిర్మాణ తీరు,ముఖమండప శైలులు ఆ కాలపు కళాత్మక నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.గర్భగుడిలో స్వయంభూ సోమేశ్వరలింగం భక్తుల పూజలందుకుంటోంది.ఆలయ ప్రాంగణంలో కనిపించే శిలాశాసనాలు,శిల్పచిత్రాలు ఆ కాలపు సాంస్కృతిక,ఆధ్యాత్మిక జీవన విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయి.శైవ సంప్రదాయం విశేషంగా అభివృద్ధి చెందిన కాలంలో ఈ క్షేత్రం ప్రధాన పూజా కేంద్రంగా వెలుగొందినట్లు పండితులు అభిప్రాయపడుతున్నారు.ఈ క్షేత్రానికి సంబంధించిన పురాణగాథ మరింత ఆసక్తికరంగా నిలుస్తోంది.కపిల మహర్షి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు 101శివలింగాలను ప్రతిష్ఠించాలని ఘన సంకల్పం చేశారు.ఆయన తపోబలంతో ఒకదాని తరువాత ఒకటి లింగాలు వెలిసినట్లు పురాణాలు చెబుతున్నాయి.అయితే 100లింగాలు ప్రతిష్ఠించగలిగినా చివరి ఒక లింగం మాత్రం దొరకలేదని కథనం.ఆ ఒక్క లింగం(అప్పు)కోసం మహర్షి లోకమంతా అన్వేషించినా ఫలితం లేకపోయిందట.దాంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆయన ఈ కొండ అప్పు కొండగానే మిగిలిపోవాలని శపించారనే విశ్వాసం భక్తుల్లో ఉంది.అప్పటి నుంచి ఈ ప్రాంతం అప్పికొండగా ప్రసిద్ధి చెందిందని ఆలయ అర్చకుడు నాగరాజు వివరించారు.కాలగర్భంలో 100లింగాల్లో 95లింగాలు లీనమైపోయి ప్రస్తుతం ఐదు శివలింగాలు మాత్రమే దర్శనమిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.ఈ ఐదు లింగాలను దర్శించుకోవడం విశేష పుణ్యప్రదమని భక్తుల నమ్మకం.మహాశివరాత్రి సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చి రాత్రంతా జాగరణ,రుద్రాభిషేకాలు,లింగార్చనలు నిర్వహిస్తారు.పాలాభిషేకం,బిల్వార్చన,లఘురుద్ర,మహారుద్ర హోమాలు ఘనంగా జరుగుతాయి.కార్తీకమాసంలో దీపాలతో ఆలయ ప్రాంగణం ప్రకాశవంతమై ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత మధురంగా మారుస్తుంది.సముద్రతీరానికి సమీపంగా ఉండటం ఈ ఆలయ ప్రత్యేకతల్లో ఒకటి.అలల శబ్దం మధ్య శివనామస్మరణ మార్మోగుతుంటే భక్తులు ఆధ్యాత్మిక పరవశంలో మునిగిపోతారు.ప్రకృతి,పురాతన శిల్పకళ,పురాణగాథలు కలగలిసి ఈ క్షేత్రాన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.వార్షిక ఉత్సవాలు,అన్నదాన కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు భక్తులను ఆకర్షిస్తున్నాయి.చారిత్రకంగా,ఆధ్యాత్మికంగా,సాంస్కృతికంగా విశిష్ట స్థానం సంపాదించుకున్న ఈ శివక్షేత్రం రాష్ట్రస్థాయిలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా గుర్తింపు పొందుతోంది.సంరక్షణ చర్యలు మరింత బలోపేతం చేస్తే దేశవ్యాప్తంగా మరింత ఖ్యాతిని సంతరించుకునే అవకాశముందని భక్తులు,స్థానికులు అభిప్రాయపడుతున్నారు. Uploaded Video:

విశాఖ…గాజువాక (పున్నమి ప్రతినిధి):

బంగాళాఖాత తీరాన సముద్ర అలల మృదుస్వరాల మధ్య ఆధ్యాత్మిక కాంతిని విరజిమ్ముతున్న అప్పికొండ సోమేశ్వరాలయం సుమారు 1400ఏళ్ల చరిత్రను తనలో దాచుకున్న ప్రాచీన శైవక్షేత్రంగా విశేష ఖ్యాతి గడించింది.ప్రకృతి ఒడిలో,కొండచరియల నడుమ,సముద్రానికి అతి సమీపంలో వెలసిన ఈ దేవాలయం చారిత్రక ప్రాముఖ్యతతో పాటు పురాణగాథలతో భక్తులను ఆకర్షిస్తోంది.చాళుక్యుల కాలానికి చెందిన నిర్మాణశైలి ఈ ఆలయంలో స్పష్టంగా కనిపిస్తుంది.శిలా స్తంభాలపై చెక్కిన నాజూకైన శిల్పాలు,గర్భగుడి నిర్మాణ తీరు,ముఖమండప శైలులు ఆ కాలపు కళాత్మక నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.గర్భగుడిలో స్వయంభూ సోమేశ్వరలింగం భక్తుల పూజలందుకుంటోంది.ఆలయ ప్రాంగణంలో కనిపించే శిలాశాసనాలు,శిల్పచిత్రాలు ఆ కాలపు సాంస్కృతిక,ఆధ్యాత్మిక జీవన విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయి.శైవ సంప్రదాయం విశేషంగా అభివృద్ధి చెందిన కాలంలో ఈ క్షేత్రం ప్రధాన పూజా కేంద్రంగా వెలుగొందినట్లు పండితులు అభిప్రాయపడుతున్నారు.ఈ క్షేత్రానికి సంబంధించిన పురాణగాథ మరింత ఆసక్తికరంగా నిలుస్తోంది.కపిల మహర్షి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు 101శివలింగాలను ప్రతిష్ఠించాలని ఘన సంకల్పం చేశారు.ఆయన తపోబలంతో ఒకదాని తరువాత ఒకటి లింగాలు వెలిసినట్లు పురాణాలు చెబుతున్నాయి.అయితే 100లింగాలు ప్రతిష్ఠించగలిగినా చివరి ఒక లింగం మాత్రం దొరకలేదని కథనం.ఆ ఒక్క లింగం(అప్పు)కోసం మహర్షి లోకమంతా అన్వేషించినా ఫలితం లేకపోయిందట.దాంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆయన ఈ కొండ అప్పు కొండగానే మిగిలిపోవాలని శపించారనే విశ్వాసం భక్తుల్లో ఉంది.అప్పటి నుంచి ఈ ప్రాంతం అప్పికొండగా ప్రసిద్ధి చెందిందని ఆలయ అర్చకుడు నాగరాజు వివరించారు.కాలగర్భంలో 100లింగాల్లో 95లింగాలు లీనమైపోయి ప్రస్తుతం ఐదు శివలింగాలు మాత్రమే దర్శనమిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.ఈ ఐదు లింగాలను దర్శించుకోవడం విశేష పుణ్యప్రదమని భక్తుల నమ్మకం.మహాశివరాత్రి సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చి రాత్రంతా జాగరణ,రుద్రాభిషేకాలు,లింగార్చనలు నిర్వహిస్తారు.పాలాభిషేకం,బిల్వార్చన,లఘురుద్ర,మహారుద్ర హోమాలు ఘనంగా జరుగుతాయి.కార్తీకమాసంలో దీపాలతో ఆలయ ప్రాంగణం ప్రకాశవంతమై ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత మధురంగా మారుస్తుంది.సముద్రతీరానికి సమీపంగా ఉండటం ఈ ఆలయ ప్రత్యేకతల్లో ఒకటి.అలల శబ్దం మధ్య శివనామస్మరణ మార్మోగుతుంటే భక్తులు ఆధ్యాత్మిక పరవశంలో మునిగిపోతారు.ప్రకృతి,పురాతన శిల్పకళ,పురాణగాథలు కలగలిసి ఈ క్షేత్రాన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.వార్షిక ఉత్సవాలు,అన్నదాన కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు భక్తులను ఆకర్షిస్తున్నాయి.చారిత్రకంగా,ఆధ్యాత్మికంగా,సాంస్కృతికంగా విశిష్ట స్థానం సంపాదించుకున్న ఈ శివక్షేత్రం రాష్ట్రస్థాయిలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా గుర్తింపు పొందుతోంది.సంరక్షణ చర్యలు మరింత బలోపేతం చేస్తే దేశవ్యాప్తంగా మరింత ఖ్యాతిని సంతరించుకునే అవకాశముందని భక్తులు,స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.