పున్నమి ప్రతి నిధి
దేశవ్యాప్తంగా అప్పులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అగ్రస్థానాల్లో నిలిచాయి. కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన 2020-21 నాటి వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 43.7% తో దేశంలో మొదటి స్థానంలో నిలవగా, తెలంగాణ 37.2% తో రెండో స్థానాన్ని దక్కించుకుంది. బ్యాంకింగ్ సేవలు, ఏటీఎం వినియోగం, రుణాలు, క్రెడిట్ సదుపాయాల విషయంలో కూడా ఈ రెండు రాష్ట్రాలు అగ్రగామిగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం వ్యక్తిగత అప్పుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాటా ఎక్కువగా ఉండటంపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.


