డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా :
ఈరోజు అప్పనపల్లి మండల ప్రజా పరిషత్ మోడల్ ప్రైమరీ పాఠశాలలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చిన్నారులు ఆనందోత్సాహాలతో ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని స్కూల్ ప్రాంగణాన్ని సందడి చేశారు. విద్యార్థులు తమ ప్రతిభను రంగరించిన ఈ వేడుకలో, పాఠశాల ఉపాధ్యాయులు, నిర్వాహకులు వారిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రఘు రామయ్య గారు, బాలెం రామకృష్ణ గారు, బాలెం పెద్ది రాజు గారు, షబ్బీర్ హుస్సేన్ గారు, అనంతలక్ష్మి గారు పాల్గొని విద్యార్థులకు ప్రోత్సాహం అందించారు. పిల్లలలో ఉన్న ప్రతిభను వెలికితీసే ఉద్దేశ్యంతో నిర్వహించిన వివిధ ఆటల పోటీలు, ప్రతిభా కార్యక్రమాలలో విజయం సాధించిన వారికి మొదటి, రెండో, మూడో బహుమతులు అందజేశారు.
ప్రత్యేకంగా, నాల్గో తరగతి విద్యార్థులకు ఎఫ్ఏ–2 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను వేదికపై సత్కరించి బహుమతులు ప్రదానం చేయడం ఈ కార్యక్రమానికి మరింత విశిష్టతను తీసుకువచ్చింది. చదువులోనూ, ఆటల్లోనూ రాణించాలనే ఉత్సాహాన్ని పిల్లల్లో నింపుతూ, ఈ వేడుకను పాఠశాల ఆనందవాతావరణంతో విజయవంతంగా పూర్తి చేసింది.


