స్థానిక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రెస్క్యూ మైన్ లో దుర్గామాత కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానిక భూపాలపల్లి పట్టణ ప్రజలు ముఖ్యంగా ముఖ్య అతిథిగా భూపాలపల్లి శాసనసభ్యులు సత్యనారాయణ రావు విచ్చేసి ఆ అమ్మవారి ప్రసాదించినటువంటి ప్రసాదాన్ని ఆరగించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రసాదం దొరకడం కూడా చాలా అదృష్టకరమైన విషయం అని అమ్మవారి కృప నియోజకవర్గ ప్రజలపై ఉండాలని అందరూ ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని అన్నారు.
Video: https://youtube.com/shorts/4l1pNUOAIT8?si=wzqxFes86J523hqc


